icc world cup 2023: ఇంగ్లండ్ తో పోరుకు ముందు భారత్ కు భారీ షాక్ ?
ఐసీసీ ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో వచ్చే ఆదివారం జరిగే కీలక పోరుకు ముందు రోహిత్ సేనకు కీలక ఆల్ రౌండర్ దూరమయ్యాడు. దీంతో అతని స్ధానంలో మరో స్టార్ బ్యాట్స్ మెన్ ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు దాదాపు క్లారిటీ ఇచ్చేశాయి. ఇప్పటికే వరల్డ్ కప్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన భారత్ అన్నీ గెలిచి 10 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉంది.
వచ్చే ఆదివారం లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే భారత్ దాదాపు సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్నట్లే. ఇప్పటికే వరుస ఓటములతో వెనుకబడ్డ ఇంగ్లండ్ పై భారత్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. అయినప్పటికీ భారత విజయాల్లో కీలకమైన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు దూరమవుతున్నాడు. దీంతో భారత్ పై ఆ మేరకు ప్రభావం పడబోతోంది.

ఈ నెల 19న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్ధిక్ పాండ్యాకు ఆ తర్వాత జరిగిన న్యూజీలాండ్ మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చేశారు. తన బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన షాట్ ను ఆపే ప్రయత్నంలో గాయపడిన హార్ధిక్ పాండ్యా ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపి చికిత్స అందిస్తున్నారు. అయితే పాండ్యా గాయం తీవ్రమైనది కాదని బీసీసీఐ నిర్ధారించింది. అయినా వరల్డ్ కప్ లో రాబోయే మ్యాచ్ లను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా విశ్రాంతి కొనసాగించాలని నిర్ణయించారు. పాండ్యా గైర్హాజరీలో స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించనున్నారు.
ఈ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లో అడిన హార్దిక్ కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆడిన ఓ ఇన్నింగ్ లో 11 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అలాగే మూడు మ్యాచ్ ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో మ్యాచ్ కు హార్దిక్ దూరం కావడం మిడిల్ ఓవర్లలో భారత బౌలింగ్ పై ప్రభావం చూపనుంది. అయితే స్పిన్నర్ల జోరుతో ఊపుమీదున్న టీమిండియా ఇతర బౌలర్ల సాయంతో ఈ లోటును అధిగమించాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications