icc world cup 2023: భారత్ తో సెమీస్ పై ఇంకా పాక్ ధీమా ! అసాధ్యాన్ని సాధిస్తామన్న బాబర్..
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ చివరికి వచ్చేసింది. శనివారం ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్, ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్యాచ్ లతో లీగ్ దశ ముగియబోతోంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అధికారికంగా, న్యూజీలాండ్ అనధికరికంగా సెమీ ఫైనల్ కు అర్హత సాధించేశాయి. కివీస్ సెమీస్ బెర్తును శనివారం సాయంత్రానికి అధికారికంగా ప్రకటించడం ఖాయమే. ఇలాంటి పరిస్ధితుల్లో ఇంగ్లండ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న పాకిస్తాన్ కు మాత్రం ఇంకా సెమీస్ ఆశ చావలేదు.
ఇప్పటికే టోర్నీలో 8 మ్యాచ్ లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్ లు గెలిచి 8 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ కు ఇంగ్లండ్ తో ఆడే మ్యాచ్ లో గెలిచినా వచ్చేది 10 పాయింట్లు మాత్రమే. ఇప్పటికే న్యూజీలాండ్ 10 పాయిట్లతో పాటు పాకిస్తాన్ కంటే మెరుగైన రన్ రేట్ కలిగి సెమీస్ కు దాదాపు అర్హత సాధించేసింది. ఇక ఇంగ్లండ్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ 287 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడిస్తే తప్ప సెమీస్ కు చేరడం అసాధ్యమే. కానీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం తమకు ఇంకా ఆశ ఉందని ఇవాళ వెల్లడించాడు.

భారత్ తో సెమీస్ లో ఆడతామన్న ధీమా తమ మనసులో ఇంకా ఉందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం వెల్లడించాడు. దీన్ని సాధించేందుకు తాము ప్రయత్నిస్తామని కూడా బాబర్ తెలిపాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో అమలు చేసే ప్రణాళికల్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నామని, వాటిని అమల్లో పెడతామని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు. అంతిమంగా భారత్ తో సెమీస్ కు అర్హత సాధిస్తామని పాకిస్తాన్ కెప్టెన్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ తో మ్యాచ్ ఎలా ఆడాలన్న దానిపై తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ తెలిపాడు. దీన్ని గుడ్డిగా చెప్పడం లేదన్నాడు. తొలి పది ఓవర్లలో ఎలా ఆడాలి, ఆ తర్వాత 20 ఓవర్లలో ఎలా ఆడాలన్న దానిపై తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు బాబర్ వెల్లడించాడు. అలాగే పిచ్ లో బ్యాట్స్ మెన్ ఎంతసేపు ఉంటాడు, మ్యాచ్ లో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడంపైనా ఆలోచిస్తున్నట్లు పాకిస్తాన్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications