icc world cup 2023: వీరిలో ఒకరికి వరల్డ్ కప్ టైటిల్ ! ఏబీ డివిలియర్స్ అంచనా..!
భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ చివరికి చేరుకుంటోంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ లోకి దూసుకెళ్లగా.. మరో రెండు బెర్తుల కోసం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య పోరు కొనసాగుతోంది. అలాగే ఐదారు స్ధానాల్లో ఉన్న ట్లు కూడా సెమీస్ బెర్తు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. వచ్చే వారం ఆ రెండు బెర్తులపై కూడా క్లారిటీ వచ్చేయడం ఖాయం. అయితే ఫైనల్ కు వెళ్లే జట్లపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ కు వెళ్లే అవకాశం ఎవరెవరికి ఉందని, టైటిల్ గెల్చుకునే ఛాన్స్ ఎవరికి ఉందన్న దానిపై పలువురు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు తమ అంచనాలు బయటపెడుతున్నారు. ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా మేటి బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ తన అంచనాల్ని వెల్లడించాడు. నవంబర్ 19న జరిగే ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో టైటిల్ గెల్చుకునే జట్టుపై తనకున్న అంచనాల్ని ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో డివిలియర్స్ వెల్లడించాడు. అయితే టైటిల్ గెల్చుకునే అవకాశం ఉన్న రెండు ఫేవరెట్ జట్లను డివిలియర్స్ ప్రకటించాడు.

ఇంతకీ డివిలియర్స్ అంచనా వేసిన ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్ గెల్చుకునే రెండు జట్లలో ఒకటి తన సొంత జట్టు దక్షిణాఫ్రికా కాగా... రెండోది భారత్. ప్రస్తుతం సెమీస్ లోకి దూసుకెళ్లిన ఈ రెండు జట్లకు ఫైనల్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్ కలిస్ కూడా వెల్లడించాడు. ఇప్పుడు డివిలియర్స్ మరో అడుగు ముందుకేసి దక్షిణాఫ్రికా లేదా భారత్ కు టైటిల్ దక్కే అవకాశం ఉందన్నాడు.
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన చూస్తుంటే ఆ జట్టుకు టైటిల్ గెల్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని డివిలియర్స్ తెలిపాడు. అలాగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవడానికి భారత్ కు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయని ఈ ప్రొటీజ్ దిగ్గజ క్రికెటర్ తెలిపాడు. దక్షిణాఫ్రికా గెలవకపోతే భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు డివిలియర్స్ వెల్లడించాడు. భారత్ ఈ టోర్నీ ఫేవరెట్ అని, ఎందుకంటే వారికి మంచి జట్టు ఉందన్నాడు. మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారన్నారు. వారు పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారని, స్వదేశంలో ఆడటం అదనపు బలం కూడా అన్నాడు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications