IND vs AFG T20: ఆప్ఘన్ తో మూడో టీ20- గెలిస్తే పాకిస్తాన్ రికార్డు బద్ధలే..!
పసికూన ఆప్ఘనిస్తాన్ తో జరుగుతున్న మూడు టీ20ల సీరిస్ లో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా ఇవాళ మరో అరుదైన రికార్డు సాధించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఆఫ్ఘనిస్తాన్ కు చుక్కలు చూపించిన రోహిత్ సేన.. ఇప్పుడు మూడో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ వైట్ వాష్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ విజయం టీమిండియాకు ఓ అరుదైన రికార్డు సాధనకు ఉపయోగపడనుంది.
ఆప్ఘానిస్తాన్ తో బెంగళూరులో ఇవాళ భారత్ మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి ఈ ద్వైపాక్షిక సిరీస్ ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియాకు మూడో మ్యాచ్ కూడా నల్లేరుపై నడకే. ఈ మ్యాచ్ కూడా గెలవడం ద్వారా రోహిత్ సేన ఈ ద్వైపాక్షిక సిరీస్ ను వైట్ వాష్ చేయడం ఖాయమే. అద్భుతాలేమైనా జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు, సిరీస్ వైట్ వాష్ కావడం ఖాయమైపోయాయి.

అయితే ఈ మ్యాచ్ లో గెలుపుతో టీమిండియా అత్యధిక ద్వైపాక్షిక టీ20 సిరీస్ లను వైట్ వాష్ చేసిన ఘనతను సాధించబోతోంది. ఇప్పటికే 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్ ల్లో వైట్ వాష్ లు నమోదు చేసిన టీమిండియా.. పాకిస్తాన్ తో సమంగా ఉంది. భారత్-పాకిస్తాన్ ఇద్దరూ మాత్రమే ఇప్పటివరకూ అత్యధికంగా 8 ద్వైపాక్షిక సిరీస్ లను వైట్ వాష్ చేసి సంయుక్తంగా రికార్డులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు భారత్ ఇవాళ మ్యాచ్ గెలిస్తే మరో వైట్ వాష్ తో భారత్ 9 ద్వైపాక్షిక సిరీస్ లు వైట్ వాష్ తో గెల్చుకున్న రికార్డు సొంతం చేసుకోవడం ఖాయం.












Click it and Unblock the Notifications