భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం: గ్రౌండ్‌లో డైహార్డ్ ఫ్యాన్: అసలే భారీ కాయం

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో బిగ్ డే. రోహిత్ సేన రంగంలోకి దిగింది. తన మొదటి మ్యాచ్ ఆడుతోంది. ఆస్ట్రేలియాను ఢీ కొడుతోంది. చెన్నైలోని ఎంఏ చిన్నస్వామి స్టేడియం ఈ బిగ్ క్లాష్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. న్యూజిలాండ్- ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఈ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. రెండో ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. టీమిండియా స్పీడ్ స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన బంతికి బిగ్ ఫిష్ ఓపెనర్ మిఛెల్ మార్ష్ బలి అయ్యాడు. ఆరు బంతులను ఎదుర్కొన్న అతను ఖాతానే తెరవలేదు. సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు.

IND vs AUS, World Cup 2023: Team India fan Jarvo again at the Chepauk Stadium

జస్‌ప్రీత్ బుమ్రా సంధించిన ఇన్ కట్టర్‌ను అర్థం చేసుకోవడంలో తికమక పడ్డాడు మార్ష్. టైమింగ్ మిస్ అయ్యాడు. నడుం ఎత్తులో వచ్చిన ఆ బంతిని చివరి క్షణంలో టచ్ చేశాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్‌ వైపు ఎగిరిన ఆ బంతిని విరాట్ కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఎడమవైపు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు.

ప్రస్తుతం ఓపెనర్ డేవిడ్ వార్నర్- 16, వన్ డౌన్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తలా మూడు ఫోర్లు బాదారు. మొత్తం ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. బుమ్రా తొలి మూడు ఓవర్లల్లో ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ నేలకూల్చాడు.

IND vs AUS, World Cup 2023: Team India fan Jarvo again at the Chepauk Stadium

కాగా ఈ మ్యాచ్‌ రసవత్తరంగా కొనసాగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. టీమిండియా డైహార్డ్ ఫ్యాన్ జార్వో ఇక్కడా ప్రత్యక్షం అయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. పరుగెత్తుకుంటూ స్లిప్స్‌లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లాడు. కోహ్లీ దగ్గరికి వెళ్లేంత వరకూ భద్రత సిబ్బంది అతన్ని పట్టుకోలేకపోయారు. అనంతరం అతన్ని బయటికి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+