బ్యాడ్‌లక్: పంత్‌ను వెంటాడిన సీమర్
Rishabh Pant: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్‌లో భారత్ భారీ స్కోర్ సాధిస్తోంది. తొలి ఇన్నింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన బ్యాటర్లు రెండో ఇన్నింగ్‌లో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోన్నారు. 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా ఇప్పుడు 400లకు పైగా స్కోర్‌ను సాధించింది. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి.
రెండో ఇన్నింగ్ మూడో రోజు ఆటలో భారత జట్టు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్.. ఆకాశమే హద్దుగా ఆడాడు. సెంచరీ చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లల్లో ఇదే అతన తొలి హండ్రెడ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో నంబర్ 4లో దిగిన అతను సెంచరీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిగ్గా 150 పరుగులు చేసిన అతన్ని టిమ్ సౌథీ బోల్తా కొట్టించాడు.

సౌథీ వేసిన అవుట్ స్వింగర్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు సర్ఫరాజ్. భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కవర్స్ వైపు దూసుకెళ్లిన బంతిని ఎజాజ్ పటేల్ అద్భుతంగా అందుకున్నాడు. సర్ఫరాజ్ రూపంలో 408 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత్. నేటికి అదే తొలి వికెట్ కూడా.
మరో ఎండ్‌లో పాతుకుపోయిన రిషభ్ పంత్ కూడా ఆ వెంటనే అవుట్ అయ్యాడు. సరిగ్గా 99 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్ వికెట్ కీపర్ బ్యాటర్. రోక్ వేసిన సీమ్ డెలివరీని స్క్వేర్ కట్ ఆడబోయాడు పంత్. టైమింగ్ మిస్ అయ్యాడు. ఎక్స్‌ట్రా బౌన్స్ అయిన ఆ డెలివరీ.. బ్యాట్ ఎడ్జ్‌ను తాకి వికెట్లను గాల్లోకి ఎగురగొట్టింది. ఒక్క పరుగుతో సెంచరీని కోల్సోయాడు పంత్.
దీనితో 433 పరుగుల వద్ద అయిదో వికెట్ పడింది. అతని తరువాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. 12 పరుగులకే వెనుదిరిగాడు. రోక్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 438 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. టీ విరామ సమయానికి రవీంద్ర జడేజా నాలుగు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మొత్తంగా 82 పరుగుల ఆధిక్యతను సాధించింది భారత్. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications