IND vs WI: ఉచిత పాస్‌లతో లక్షల దందా.. భారత్–విండీస్ మ్యాచ్‌కు ముందు నలుగురు అరెస్ట్!

IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ కోసం కేటాయించిన ఉచిత పాస్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడితో పాటు మరో ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగం బజార్‌లోని ఎస్డీ మాల్ సమీపంలో అక్రమంగా టికెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు.

IND vs WI: హైదరాబాద్‌లో టీమిండియా మరో చరిత్ర సృష్టిస్తుందా?
IND vs WI: హైదరాబాద్‌లో టీమిండియా మరో చరిత్ర సృష్టిస్తుందా?

ఉచిత పాస్‌లను రూ.3500 నుంచి రూ.6000 వరకు విక్రయం
ఈ కేసులో హెచ్‌సీఏ సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడు ఆకర్ష్ శ్రీవాస్తవ, అవినాష్ దారక్, మోహిత్ సోమానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్ చంద్ర హెచ్‌సీఏ నుంచి పొందిన ఉచిత పాస్‌లను తన కుమారుడు ఆకర్ష్‌కి ఇచ్చాడు. ఆకర్ష్ వాటిని విక్రయించడానికి తన స్నేహితుడైన అవినాష్‌కు అప్పగించగా.. మోహిత్ అతనికి సహకరించాడు. వీరు ఒక్కో పాస్‌ను రూ.3,500 నుంచి రూ.6,000 వరకు విక్రయించేందుకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రకటనలు ఇచ్చారని విచారణలో తేలింది.

IND vs WI T20 Ticket Black Marketing HCA Member Among Four Arrested in Hyderabad Full Details
IND vs WI 4th T20: హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే!
IND vs WI 4th T20: హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే!

నగదు స్వాధీనం
ఈ ఆపరేషన్లో పోలీసులు 'అమ్మకానికి కాదు' అని స్పష్టంగా ముద్రించి ఉన్న 11 టీ20 మ్యాచ్ పాస్‌లతో పాటు 8 నవరాత్రి దండియా ఈవెంట్ పాస్‌లు, రూ.5,000 నగదు, ఓ మొబైల్ ఫోన్, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులను అక్టోబర్ 13న జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వీరిపై బీఎన్ఎస్ సెక్షన్లు 112(1), 318(2), హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 21(gg) కింద కేసులు నమోదు చేశారు. హెచ్‌సీఏ నుంచి సతీష్ చంద్రకు మొత్తం ఎన్ని పాస్‌లు జారీ అయ్యాయనే కోణంలో పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+