జగన్ అక్రమాస్తుల కేసుల్లో బిగ్ ట్విస్ట్, సీబీఐ కోర్టు కీలక నిర్ణయం..!!
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసుల విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. జగన్ ఈడీ కేసులను కూడా రోజువారీ విచారణ జరిపేందుకు న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. జగన్ సహా 70 మంది నిందితులను వ్యక్తిగతంగా సీబీఐ కోర్టు విచారణ చేయనుంది. ఈడీ తాజాగా దాఖలు చేసిన పిటీషన్ మేరకు సీబీఐ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసుల విచారణలో సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన సీబీఐ కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను కూడా రోజువారీగా విచారించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. ఈ మేరకు రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ న్యాయవాదులకు సూచించింది. జగన్ సహా 70 మంది నిందితుల కేసుల విచారణపై కోర్టు దృష్టి సారించింది. సీబీఐ కోర్టులో గత పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్లో ఉండగా, నిందితుల డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. కాగా, ఈడీ కేసులను రోజువారీగా విచారించాలని అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇక రోజు వారీ విచారణ
కాగా.. జగన్పై న్యాయస్థానంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసులకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన తొమ్మిది చార్జిషీట్లు దాదాపు దశాబ్ద కాలంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్లో ఉన్నాయని ఈడీ తెలిపింది. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాకపోవడం వల్లే విచారణ ముందుకు సాగడం లేదని పేర్కొంది. విచారణకు జగన్తో పాటు ఇతర నిందితులంతా వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని కూడా ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. గత కొన్నేళ్లుగా ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టుల విచారణ, ఉన్నత న్యాయస్థానాల్లో సవాళ్లు వంటి పలు న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ జరగాల్సి ఉంది. దీంతో.. వచ్చే విచారణ వేళ చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
