భారత్ - వెస్టిండీస్ మ్యాచ్ వర్షంలో కొట్టుకుపోతే సెమీస్ చేరేదెవరు, లెక్క క్లియర్..!!

T20 World Cup Ind Vs WI: టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ లోకి టీమిండియా అడుగు పెడుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. జింబాబ్వే పైన గెలిచినా... టీం ఇండియా వెస్టిండీస్ తో తల పడాల్సి ఉంది. సెమీస్ చేరేందుకు రెండు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సూపర్- 8 పాయింట్ల పట్టికలో జింబాబ్వేతో గెలుపు తరువాత టీమిండియా మూడో స్థానంలో ఉంది. కోల్ కతా మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమస్య లేకుండా సెమీస్ చేరుతుంది. మారుతున్న వాతావరణంతో వర్షం కురిచి మ్యాచ్ రద్దయితే.. సెమీస్ ఛాన్స్ ఎవరికి.. అసలు లెక్క ఏంటి..

జింబాబ్వే పైన టీమిండియా విజయం సాధించింది. గెలిచి పాయింట్లు పెరిగినా... కావాల్సిన రన్ రేటు మాత్రం రాలేదు. బ్యాటర్లు వీర విహారం చేసినా.. బౌలర్లు జింబాబ్వే బ్యాటర్ల నియంత్రణలో సక్సెస్ కాలేదు. ఫలితంగా రన్ రేటు పెంచుకోవాల్సి ఉన్నా... కావాల్సినంతగా రాలేదు. ఇక, మార్చి 1న కోల్ కతాలో జరిగే మ్యాచ్ టీం ఇండియా - వెస్టిండీస్ రెండు జట్లకు డూ ఆర్ డై గా మారింది. గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. జింబాబ్వేతో మ్యాచ్ లో భారత్ బౌలర్ల ఆట తీరు చూసిన తరువాత భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ తో మ్యాచ్ వేళ సందేహాలు మొదలయ్యాయి. విండీస్ లో ఓపెనర్ దగ్గర నుంచి చివరి వరకు అందరూ బంతిని బౌండరీకి పంపేందుకు వచ్చాం అనే విధంగా ప్రపంచ కప్ లో ఆడుతున్నారు. మరి.. వీరిని నియంత్రించేందుకు గంభీర్ - సూర్య కాంబో ఏం ప్లాన్ చేస్తారు.. బౌలర్లను ఎలా సమాయత్తం చేస్తారనేది విండీస్ తో మ్యాచ్ వేళ అసలైన పరీక్షగా మారుతోంది. బూమ్రా.. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయటంలో వారి వ్యూహాలు ఫలించటం లేదు. దీంతో.. టీం పైన ఒత్తిడి పెరుగుతోంది.

ind-vs-wi-what-happens-if-india-vs-west-indies-super-8-game-is-abandoned-in-kolkata-who-will-reach

రెండు జట్లకు చావో రేవో

ఇక.. కోల్ కతా మ్యాచ్ లో భారత్ గెలిస్తే రన్ రేటుతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అదే విధంగా వెస్టిండీస్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం అవుతుంది. భారత్ అప్పుడు టోర్నీ నుంచి సూపర్ -8 దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26న జరిగిన మ్యాచులు భారత జట్టుకు కలిసొచ్చాయి. మొదట జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను ఓడించడంతో టీమిండియాకు రూట్ క్లియర్ అయ్యింది. ఆ తర్వాత భారత్ తన వంతుగా జింబాబ్వేను చిత్తు చేసి 2 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం గ్రూప్-1లో భారత్, వెస్టిండీస్ రెండు జట్లూ రెండేసి మ్యాచులు ఆడి, చెరో విజయం (2 పాయింట్లు)తో సమానంగా ఉన్నాయి. దీనివల్ల ఆదివారం (మార్చి 01) జరగబోయే భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌గా మారిపోయింది. అయితే, కోల్‌కతాలో వాతావరణం మారుతోంది. ఈ కీలక మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారితే కనీసం 5 ఓవర్లు ఆడితేనే ఫలితం వస్తుంది. అదీ సాధ్యం కాకుంటే రన్ రేటు ప్రకారం విజేతను డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేటు -0.100 గా ఉండగా.. వెస్టిండీస్ రన్ రేట్ 1.791గా ఉంది. దీంతో విండీస్ కు రూట్ క్లియర్ అవుతుంది. దీంతో.. వర్షం లేకుండా.. భారత్ అన్ని రంగాల్లో రాణిస్తే.. సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+