సఫారీల షాక్ తో టీంలో కీలక మార్పులు - స్టార్ బ్యాటర్ అవుట్, ఆల్ రౌండర్ కు పిలుపు..!!
India Vs Zimbabwe t20 World cup: టీ20 ప్రపంచ కప్ లో ఇప్పుడు టీమిండియా సెమీస్ చేరుతుందా. ఇంకా ఛాన్స్ ఉందా. సూపర్ -8 తొలి మ్యాచ్ లో టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో సఫారీలపై ఓటమిని చవిచూసింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. కాగా, దారులైతే పూర్తిగా మూసుకుపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరాలంటే కొన్ని లెక్కలు కీలకం అవుతున్నాయి. అదే సమయంలో టీంలో మార్పులు అనివార్యంగా మారు తున్నాయి. ఫలితంగా జింబాబ్వే తో మ్యాచ్ కోసం పలు మార్పులకు రంగం సిద్దమైంది.
దక్షిణాఫ్రికా తొలుత తడబడినా.. తరువాత నిలబడింది. ప్రత్యర్థి టీం బలహీనతలను అనుకూలం గా మలచుకుంది. సూపర్ -8 లో తొలి మ్యాచ్ లో గెలిచి సెమీస్ అవకాశాలు దాదాపు ఖాయం చేసుకుంది. భారత్ బ్యాటర్లు అవసరం లేని షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేశారు. యాన్సెన్ వేగంతో పాటు కేశవ్ మహరాజ్ స్పిన్ దెబ్బకు భారత్ పూర్తిగా కుదేలైంది. మధ్యలో హార్దిక్, దూబె కొంతమేరకు రాణించారు. ఈ మ్యాచ్ భారత్‌కు గట్టి హెచ్చరికలా మారింది. బౌలింగ్‌లో మంచి ఆరంభం వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోవడం, బ్యాటింగ్‌లో బాధ్యత లేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. పెద్ద జట్లపై ఆడేటప్పుడు ఓపిక, ప్లాన్ ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. ఇప్పుడు భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఎదుర్కొనుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే కొన్ని మార్పులు తప్పవని గుర్తించింది.

సెమీస్ చేరాలంటే సూర్య సేన ముందు కొత్త లెక్కలు
టీమిండియాపై విజయంతో సౌతాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో తొలి స్థానంలో నిలిచింది. భారీ పరుగుల అంతరాయంతో ఓడటంతో టీమిండియా నెట్ రన్‌రేట్ -3.800గా ఉంది. సూపర్ 8లో భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. అప్పుడు భారత్ ఖాతాలోకి 4 పాయింట్లు వస్తాయి.అదే సమయంలో జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో 4 పాయింట్లు ఉండకూడదు. అలా అయితేనే భారత్ సెమీస్‌కు వెళ్తుంది. దీంతో.. జింబాబ్వే సైతం భీకర ఫాంలో ఉండటంతో జట్టులో మార్పులకు టీం సిద్దమైంది. అభిషేక్ సఫారీల బౌలింగ్ లో షాట్స్ కొట్టటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. రెండు వికెట్లు కోల్పోయిన సమయంలోనూ తన తీరు మార్చుకోలేదు. అదే విధంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను ఈ కీలక మ్యాచ్ లో ఎందుకు ఆడించలేదో ఎవరికీ అంతు చిక్కని విషయం. రింకూ సింగ్ ఆట తీరు ఆశాజనకంగా లేదు. దీంతో.. జింబాబ్వే పై గెలవటంతో పాటుగా రన్ రేట్ ముఖ్యం. దీంతో.. టీంలోకి సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ను తీసుకొచ్చేలా కసరత్తు జరుగుతోంది. మరి.. ఫుల్ జోష్ మీద ఉన్న జింబాబ్వే .. ఇటు ఒత్తిడి మీద ఉన్న టమీండియా మధ్య జరిగే సూపర్ -8 మ్యాచ్ లో సూర్య సేన సెమీస్ భవిష్యత్ డిసైడ్ కానుంది.
-
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
త్రిషతో సంబంధాలపై ఏకిపారేసిన విజయ్ -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
దుబాయ్, అబుదాబీలో భారతీయులకు గుడ్ న్యూస్..! -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు..! -
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ ఆఫర్ - ఇక ప్రతీ కుటుంబానికీ..!! -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే! -
వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం - అనూహ్య నిర్ణయం..!! -
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, వారికి కేటాయింపు - పంపిణీ ముహూర్తం..!!













Click it and Unblock the Notifications