T20 World Cup ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ పై మైండ్ బ్లోయింగ్ విక్టరీ..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా .. సెమీ పైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. భారీస్కోర్లతో హోరాహోరీగా సాగిన సెమీ పైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఆదివారం న్యూజీలాండ్ తో జరిగే సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్లో భారత్, న్యూజీలాండ్ టైటిల్ కోసం తలపడబోతున్నాయి.
ముంబైై వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కు ఆరంభంలోనే అది ఎంత తప్పో తెలిసివచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచీ భారత బ్యాటర్లు చెలరేగారు. ముఖ్యంగా సంజూ శాంసన్ మరోసారి రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానం నలువైపులా షాట్లు కొట్టాడు. శ్యాంసన్ 89, ఇషాన్ కిషన్ 39, శివం దూబే 43 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, విల్ జేక్స్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ దూకుడుగా బ్యాాటింగ్ ఆరంభించింది. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను యువ లెఫ్ట్ హ్యాండర్ జాకబ్ బెథెల్ ఆదుకున్నాడు. భారీ షాట్లతో మైదానం నలువైపులా విరుచుకుపడిన బెథెల్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి అతనికి తగిిన సహకారం అందలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్, అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications