Ind Vs Aus: రోహిత్ డ్రాప్ - బూమ్రాకు 'టెస్ట్' టైం, తడబాటు..!!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ డిసైడర్ మ్యాచ్ లో ఊహించిందే జరిగింది. రోహిత్ శర్మ తుది టీంలో లేరు. బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. రోహిత్ స్థానంలో గిల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. టాస్ గెలిచిన బూమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీంలో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. లంచ్ సమయానికి టీమిండియా 57/3 తో కొనసాగుతోంది.
టాస్ గెలిచి.. బ్యాటర్ల తడబాటు
సిరీస్ ను డిసైడ్ చేసే సిడ్నీ టెస్టులో టీమిండియా కూర్పు నుంచి ఆట వరకు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ నుంచి రోహిత్ తప్పుకున్నారు. ప్రస్తుతం ఫామ్‌లేక తంటాలు పడుతున్న రోహత్ ఈ మ్యాచ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రోహిత్ స్వయంగా తప్పుకు న్నట్లు కెప్టెన్ బూమ్రా వెల్లడించాడు. అదే విధంగా గాయం కారణంగా తప్పుకున్న పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులో చేరాడు. అటు ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ స్థానంలో కొత్త ప్లేయర్ వెబ్‌స్టెర్‌ను తీసుకుంది. ఈ మ్యాచ్ తోరా వెబ్‌స్టెర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

టీమిండియా 57/3
కెప్టెన్ బూమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆట మొదలైన కొద్ది సేపటికే టీమిండియా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. 17 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. మొదట కేఎల్ రాహుల్ (04), ఆ తర్వాత యశస్వి జైస్వాల్ (10) స్వల్ప వ్యవధిలోనే ఔట్ అయ్యారు. 20 పరుగులు చేసిన గిల్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. లంచ్ సమయానికి టీమిండియా 57పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 12 పరుగులతో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ కు ముందు జరిగిన ప్రచారంతో రోహిత్ దూరం కాగా.. కోహ్లీ పైన ఒత్తిడి ఉంది.
సిరీస్ సమం చేయాలంటే
ఈ టెస్టులో టీమిండియా గెలిస్తేనే సిరీస్ సమం చేసే అవకాశం ఉంటుంది.ఈ మ్యాచ్ బూమ్రా సమర్ధతకు పరీక్షగా మారుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో బూమ్రా కెప్టెన్సీ లోనే భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత, తదుపరి మూడు టెస్టులకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మూడు మ్యాచ్ ల్లో టీమిండియా 2 టెస్టుల్లో ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత క్రికెట్‌లో యాభై ఏళ్ల తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కెప్టెన్‌ను తొలగించడం దాదాపు ఇదే తొలిసారి. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవటం మంచి నిర్ణయంగా వ్యాఖ్యాత రవి శాస్త్రి పేర్కొన్నారు. కాగా, కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తారనేది కీలకంగా మారుతోంది. కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications