IND VS NZ : టాస్ ముఖ్యం కాదన్న గవాస్కర్-భారత్ చేయాల్సిన పరుగులివే !
ముంబైలోని వాంఖడే స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానున్న ఇండియా-న్యూజీలాండ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో సెమీ ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ గెలుస్తుందా, గతంలో నాకౌట్ పోటీల్లో భారత్ పై పైచేయి సాధించిన న్యూజీలాండ్ ఈసారి గెలుస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్-కివీస్ సెమీస్ పోరు ఫలితానికి టాస్ అత్యంత కీలకమని అంతా చెప్తున్నారు.
కానీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం భారత్-కివీస్ పోరులో టాస్ అంత ముఖ్యం కాదని విశ్లేషించాడు. ఎందుకంటే భారత బౌలర్ల ప్రస్తుత ఫామ్ చూస్తుంటే టాస్ ఓడి ఫీల్డింగ్ చేయాల్సి వచ్చినా వారు దుమ్ముదులుపుతారని అంచనా వేస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో ఇరగదీస్తున్న భారత బౌలర్లు.. ఈ మ్యాచ్ లోనూ కివీస్ ను కట్టడి చేస్తారన్నాడు. దానికి టాస్ తో సంబంధం లేదన్నాడు. టాస్ తో సంబంధం లేకుండానే భారత బౌలర్లు ఈ మ్యాచ్ లోనూ తమ ఫామ్ ను కొనసాగిస్తారని గవాస్కర్ అంచనా వేస్తున్నాడు.

అలాగే బ్యాటింగ్ లోనూ గవాస్కర్ తన అంచనాల్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తే భారత్ 300 పరుగులకు పైగా చేస్తే కానీ మ్యాచ్ గెలవడం కష్టమన్న అంచనాల్ని కూడా సన్నీ కొట్టిపారేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ లో భారత్ 260 నుంచి 270 పరుగులు చేస్తే చాలన్నాడు. భారీ పరుగులు అవసరం లేదని వెల్లడించాడు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల ఓ అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోరు చేస్తే ఆ మేరకు బౌలర్లు ఛేజింగ్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా వికెట్లు తీసేందుకు మార్గం సుగమం అవుతుందని సన్నీ చెప్తున్నాడు.
మరోవైపు ఈసారి టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా భీకరంగా ఉందని సునీల్ గవాస్కర్ తెలిపాడు. ముఖ్యంగా ముగ్గురు భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తమ హోం గ్రౌండ్ లో ఆడుతుండటం, ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఫామ్ లో ఉండటం వంటి కారణాలతో భారత్ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందన్నాడు.












Click it and Unblock the Notifications