Team India: వన్డే టీమ్ లో అవకాశం ఎవరికి ? సెలక్టర్లకు కత్తిమీద సామే..!

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో ఎదురైన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త ఏడాదిలో వన్డే సిరీస్ ల కోసం భారత జట్టు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్ తో సిరీస్ రూపంలో రెండు వన్డే సిరీస్ లు ఉన్నాయి. వీటికి జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ తర్వాత కేవలం 6 వన్డేలే ఆడిన జట్టులో ఎవరిని ఉంచాలో, ఎవరిని తీయాలో సెలక్టర్లకు అంతుబట్టడం లేదు.

2023 వరల్డ్ కప్ తర్వాత భారత్ ఆరు వన్డేలు మాత్రమే ఆడగా.. ఇందులో మూడు గతేడాది ఆడినవే ఉన్నాయి. దీంతో ఈ ఆరు మ్యాచ్ ల ప్రాతిపదికన జట్టును ఎంపిక చేయలేక, అలాగని ప్లేయర్స్ తాజా ఫామ్ అంచనా వేయలేక సెలక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే 2027 వరల్డ్ కప్ రేసులో ఉన్న పలువురు ఆటగాళ్లను సెలక్టర్లు ఇప్పటికే గుర్తించారు. కానీ వేగంగా మారుతున్న పరిస్ధితుల్లో వారికీ అవకాశం దక్కుతుందా లేదా చెప్పలేని పరిస్ధితి.

india ODI team selection challenge for selectors as it played 6 matches after 2023 world cup

టీమిండియా వన్డే బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే ఓపెనర్ గా టెస్టు, టీ20ల్లో ఆడుతున్న యశస్వీ జైశ్వాల్ కు అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. అలాగే రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ను కొనసాగించే అవకాశముంది. రోహిత్ వన్డే కెప్టెన్ గా ఉంటూ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే..విరాట్ కోహ్లీ నంబర్ 3లో ఉండటంతో .. టాప్ ఆర్డర్‌లోకి ఎడమచేతి వాటం బ్యాటర్‌ను తీసుకుంటే జైస్వాల్ ఎంపిక కావచ్చు. 2023 వరల్డ్ కప్ తర్వాత అవకాశాలు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్ కూడా టీమ్ పోటీలో ఉన్నారు.

2023 వరల్డ్ కప్ తర్వాత వన్డేలు ఆడని రవీంద్ర జడేజాకు చోటు దక్కడం కష్టమే. అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్‌ రూపంలో చాలా మంది ఆల్ రౌండర్లు అందుబాటులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా మాత్రం ఈ సీజన్‌లో ఫిట్ నెస్ నిరూపించుకుని తిరిగి వచ్చే అవకాశముంది. పరాగ్ భుజం గాయం నుండి కోలుకున్నాడు. గతేడాది శ్రీలంకలో ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తమ స్ధానాలు నిలబెట్టుకునే అవకాశముంది. జడేజా, సూర్యకుమార్ మాత్రం కష్టమే.
వికెట్ కీపర్ గా పంత్, సంజూ శాంసన్ మధ్య గట్టి పోటీ ఉంది.

బౌలింగ్ విషయానికొస్తే.. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ కోలుకుంటే జట్టు సెలక్షన్ కు అందుబాటులో ఉండొచ్చు. బుమ్రా ఫిట్‌గా లేకుంటే హార్దిక్‌తో పాటు షమీ, మహ్మద్ సిరాజ్‌ లను ఎంపిక చేసే అవకాశముంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి లు బౌలింగ్ బ్యాకప్ స్ధానాలకు పోటీ పడుతున్నారు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఎంపిక కావచ్చు. కుల్‌దీప్ ఫిట్‌గా లేకుంటే, ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్‌ ల రూపంలో ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా మరో ఆప్షన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+