Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సూపర్ 8లో ఫైనల్ కాని ఫైనల్ ఆడబోతున్న భారత్

టీ20 వరల్డ్ కప్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడబోతోంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. నాటి ఫైనల్ రీమ్యాచ్‌గా పరిగణిస్తారు దీన్ని. ఈ టోర్నమెంట్‌లో భారత్ కు సమవుజ్జీగా నిలిచింది దక్షిణాఫ్రికా. లీగ్స్ ఏ ఈ రెండు జట్లు కూడా ఏ ఒక్క మ్యాచ్ ను కూడా ఓడిపోలేదు. తమ ప్రత్యర్థులను చిత్తుచేసి సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఏ జట్టు గెలుస్తుందో.. ఏది ఓడుతుందో అని అంచనాలు వేయలేనంత పటిష్టంగా ఉన్నాయివి.

రెండు జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. టీ20 క్రికెట్‌లో ప్రస్తుతానికి అత్యుత్తమ జట్లుగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ పోరాటం జరగనుంది. బలమైన బ్యాటింగ్ లైనప్‌లు, అత్యుత్తమ బౌలర్లు ఈ రెండు జట్లకు బలంగా ఉన్నాయి.

India Playing 11 vs South Africa Clash of the Contenders in the T20 World Cup Preview with Weather

భారత్ తుది జట్టు అంచనా..

ఓపెనర్లు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్

ఎడమచేతి వాటం బ్యాటర్లు అభిషేక్ శర్మ అరంగేట్రం నుంచి టీ20 ఇంటర్నేషనల్స్ లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వస్తోన్నాడు. ప్రస్తుత టోర్నమెంట్‌లో అతను భారీగా పరుగులు చేయడంలో కొంత విఫలమౌతున్నాడు. లీగ్స్ లో హ్యాట్రిక్ డకౌట్ సాధించాడు. అభిషేక్ శర్మ ఫామ్ కొంత ఆందోళనకంగా ఉంటోన్నప్పటికీ.. అతన్నే కొనసాగించబోతోన్నామని కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తేల్చి చెప్పాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరూ భారత బ్యాటింగ్ లైనప్‌లో అత్యంత విధ్వంసకర ఓపెనింగ్ ద్వయంగా నిలిచే అవకాశం ఉంది.

మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు..

టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో విధ్వంసం రేపే బ్యాటర్లు ఉన్నారు. తిలక్ వర్మ పెద్దగా ఫామ్ లో లేనప్పటికీ.. తనదైన టచ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరి మూడు మ్యాచ్ లల్లో వ్యక్తిగత స్కోర్ సరిగ్గా 25 పరుగులకే అతను అవుట్ అవుతూ వస్తోన్నాడు. అయినప్పటిక- ఒక్కసారి రిథమ్ అందుకుంటే అతన్ని ఆపడం కష్టం. కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో నిలకడగా రాణిస్తున్నాడు.

హార్దిక్ పాండ్యా భారత లోయర్ ఆర్డర్‌లో పవర్‌హిట్టింగ్‌ చేయగలడు. అనుభవజ్ఞుడైన మిడిల్ ఆర్డర్ ఆల్‌రౌండర్‌గా పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రింకు సింగ్‌ను భారత మిడిల్ ఆర్డర్‌లో వివిధ స్థానాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. శివమ్ దూబే జట్టుకు సమర్థవంతమైన ఫినిషర్‌గా నిలవగలడు.

బలమైన బౌలింగ్..

ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థులను కట్టడి చేస్తూ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు. అతనితో పాటు వరుణ్ చక్రవర్తి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ కు ఎదురేలేదు.

భారత్ తుది జట్టులో..

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది.

వాతావరణం..

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ప్రస్తుతానికి వర్షం పడే సూచనలేవీ లేవు. వాతావరణం పొడిగా ఉంటుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ గాలిలో తేమ శాతం అధికమౌతుంది. భారత్- దక్షిణాఫ్రికా జట్లకు ఈ పిచ్ కొట్టినపిండే. దక్షిణాఫ్రికా కూడా చాలా మ్యాచ్ లు ఆడిందిక్కడ. అలాగే- పలు ఐపీఎల్ మ్యాచ్ లు ఇక్కడ జరిగాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇక్కడ ఆడిన అనుభవం రెండు జట్ల ప్లేయర్లకూ ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+