Ind vs Eng: దుమ్మురేపిన టీమిండియా-ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం..!
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) రెండో సెమీ ఫైనల్లో భారత్ దుమ్మురేపింది. సంజూ శాంసన్ తో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అంతా విజృంభించిన వేళ ఇంగ్లండ్ ముందు ఏకంగా 254 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్ మెన్ ను నిలువరించేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ముంబైలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హారీ బ్రూక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వెంటనే భారత కెప్టెన్ సూర్య కుమార్ తాము అయితే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పేశాడు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ నిర్ణయం తప్పని తేేలిపోవడానికి ఎంత ో సమయం పట్టలేదు. బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు సంజూ శాంసన్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చాడు. ఇంగ్లాండ్ పేసర్లు, స్పిన్నర్లపై విరుచుకుపడుతూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అభిషేక్ 9 పరుగులే చేసి విఫలమైనా .. వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ సాయంతో సంజూ దూకుడు కొనసాగింది. ఆ తర్వాత 39 పరుగులు చేసిన ఇషాన్ అవుటయ్యాడు.

ఈ దశలో సంజూ శాంసన్, శివమ్ దూబే జోడీ దూకుడు పరుగుల వర్షం కొనసాగించింది. 89 పరుగులు చేసిన సంజూ అవుటైనా, దూబే 43, హార్ధిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులతో రాాాణించారు. దీంతో భారత్ స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు విల్ జేక్స్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్ కు ఓ వికెట్ దక్కింది. 254 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభిస్తోంది.












Click it and Unblock the Notifications