Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!!
T20 World Cup India Vs England 1st Semi Final: టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో తల పడనుంది. ఇప్పటి వరకు భారత్ అటు బ్యాటింగ్.. బౌలింగ్ లో ఆశించిన స్థాయిలో ఏకపక్షంగా ఆధిపత్యం చూపించ లేకపోయింది. సెమీస్ అందునా.. ఇంగ్లాండ్ తో కావటం తో గంభీర్ కొత్త స్కెచ్ సిద్దం చేసారు. అభిషేక్ - సంజూ, ఇషాన్ ఈ ముగ్గురూ పవర్ ప్లే లో ఇంగ్లీష్ బౌలర్లకు దొరక్కపోతే.. మ్యాచ్ సగం పూర్తయినట్లే. వీరి పైనే ఇంగ్లాండ్ గురి పెట్టింది. దీంతో పాటుగా సెంటిమెంట్ సైతం వెంటాడుతోంది.
టీ20 ప్రపంచ కప్ లో భారత్.. మరో బిగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. సెమీ ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోవడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. స్పిన్నర్ విల్ జాక్స్ రూపంలో అభిషేక్‌కు గండం పొంచి ఉంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ మరోసారి మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ తమ బ్యాట్లకు పనిచెప్పాలి. అయితే, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపలేక పోతుండడం జట్టుకు మైన్‌సగా మారింది.

బుమ్రా రాణిస్తున్నా.. మరో పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో నిలకడ లోపించింది. ఆరో బౌలర్‌గా శివం దూబేను సూర్య ఎలా వాడుకొంటాడో చూడాలి. గత మ్యాచ్‌లో ఆడిన జట్టును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉండడంతో కుల్దీప్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఇక్కడ మరోవైపు స్పిన్ బలంతో ఇంగ్లండ్ ప్రత్యర్థులను వణికిస్తోంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఆల్‌రౌండర్ విల్ జాక్స్ జట్టుకు మూలస్తంభాలుగా మారారు. ఓపెన్ బట్లర్ విఫలమవుతున్నా.. సాల్ట్, సామ్ కర్రాన్ ఆదుకొంటున్నారు.
పవర్ ప్లే డిసైడిండ్ ఫ్యాక్టర్.. కొత్త లెక్కలు
కాగా.. ఓవర్టన్ పవర్‌ప్లేలోనే వికెట్లు పడగొడుతున్నాడు. మిడిల్ ఓవర్లలో డాసన్, ఆదిల్ రషీద్ స్పిన్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలే. మరోవైపు బ్యాటింగ్‌తో పోలిస్తే, బౌలింగ్‌లో భారత్ కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. దీంతో.. ఇంగ్లాండ్ పవర్ ప్లే బౌలర్లు.. భారత బ్యాటర్ల బలహీనత లను పరిగణలోకి తీసుకొని బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. టాస్ ఫలితం ఆధారంగా ఈ మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే ఒక ప్లాన్.. ఛేజింగ్ టార్గెట్ కు అనుగుణంగా మరో ప్లాన్ కోచ్ గౌతం గంభీర్ సిద్దం చేసారు. ఇక.. టీం20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్- భారత్ సెమీఫైనల్ ఆడడం వరుసగా ఇది మూడోసారి.
2022లో తొలిసారి భారత్ -ఇంగ్లాండ్ ఢీ కొట్టాయి. ఇందులో ఇంగ్లాండ్ నెగ్గి ఫైనల్ కు వెళ్లింది. 2024 సెమీస్ లోనూ ఈ ఇరుజట్లు పోటీ పడ్డాయి. ఈసారి భారత్ నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిదిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. అలా గత రెండుసార్లు సెమీస్ లో గెలిచిన టీం ఛాంపియన్ గా నిలిచింది. వాంఖడే క్రికెట్ స్టేడియం బ్యాటర్లకు అనుకూలమైన మైదానం. 200 పైచిలకు స్కోర్లు నమోదు కావొచ్చని అంచనాలు ఉన్నాయి. పేసర్లకు బౌన్స్ లభిస్తుంది. స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది. దీంతో.. పిచ్ .. టాస్ ఈ మ్యాచ్ లో కీలకంగా మారనున్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications