IND Vs SA: విశాఖ మ్యాచ్ లో ఆ మగ్గురు ఔట్, వీరు ఇన్: రో-కో కు కలిసొచ్చిన గ్రౌండ్..!!

విశాఖ క్రికెట్ మేనియా కనిపిస్తోంది. మూడో వన్డే కోసం క్షణాల్లో టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. రోహిత్ - కోహ్లీ కాంబో కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. కోహ్లీ వరుస సెంచరీలతో విశాఖ వన్డే పై అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ కోహ్లీకి కలిసొచ్చే గ్రౌండ్. మంచి రికార్డులు ఉన్నాయి. కాగా, రెండు జట్లు ప్రాక్టీసు మొదలు పెట్టాయి. సిరీస్ డిసైడర్ గా నిలిచే మ్యాచ్ కావటంతో మరింతగా ఆసక్తి నెలకొంది. సాగర తీరాన మరోసారి బౌండరీల హోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ముగ్గురిని తప్పించి.. వారి స్థానంలో మరో ముగ్గురికి అవకాశం దక్కనుంది.

విశాఖ కేంద్రంగా శనివారం జరిగే భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ కు భారీ స్పందన కనిపిస్తోంది. భారత్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగుతుండడంతో స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మ్యాచ్​కు టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడయ్యాయి. సాధారణంగా భారత్​లో క్రికెట్ మ్యాచ్​కు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ విరాట్ కోహ్లీ అడుతున్నాడంటే మ్యాచ్ స్టేడియంలో చూడాల్సిందే అని అనుకునే ఫ్యాన్స్ వేలల్లో ఉంటారు. అలాగే చిన్న బ్రేక్ తర్వాత విరాట్ ఈ సిరీస్​లో ఆడుతున్నాడు. తొలి రెండు వన్డేల్లోనూ రెండు సెంచరీలు బాది ఊపుమీద కనిపిస్తున్నాడు. దీంతో విశాఖ వన్డేకు భారీ క్రేజ్ ఏర్పడింది. నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.

India vs South Africa 3rd ODI Tickets Gone in No Time as Demand Skyrockets In Vizag

రాంచి వన్డేలో విరాట్ సెంచరీ బాదిన తర్వాత టికెట్ అమ్మాకాల్లో జోరు పెరిగింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లను ఏసీఏ పలు విడతల్లో టికెట్ అమ్మకాలు జరిపింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 28న తొలి విడతగా టికెట్ సేల్ ప్రారంభించింది. అయితే ఈ విడతలో టికెట్ అమ్మకాలు అనుకున్న స్థాయిలో జరగలేదట. చాలా వరకు మిగిలిపోయాయట. అయితే నవంబర్ 30న రాంచీలో విరాట్ సెంచరీతో అదరగొట్టిన తర్వాత, విశాఖ వన్డే టికెట్ సేల్స్ జోరు పెరిగింది.

డిసెంబర్ 01, 03న మరోసారి ఆన్​లైన్​లో టికెట్లు విక్రయానికి అందుబాటులోకి రాగా, అప్పుడు నిమిషాల్లోనే అన్ని అమ్ముడయ్యాయి. నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయినట్లు తెలిపారు. ఇందులో రూ.1200 నుంచి రూ.18000 వేల రేంజ్​లో టికెట్లు ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో కోహ్లీ ఇప్పటిదాకా 7 వన్డే మ్యాచ్​లు ఆడాడు. ఇందులో 97.83 యావరేజ్​తో విరాట్ మూడు సెంచరీ నమోదు చేశాడు. వాటితోపాటు ఓ మ్యాచ్​లో 99 పరుగులు, ఇంకొక వన్డేలో 65 రన్స్ స్కోర్ చేశాడు. దీంతో.. ఇప్పుడు రో- కో మేనియా తో మ్యాచ్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. కాగా, తొలి రెండు మ్యాచ్ ల్లో విఫలమైన జైశ్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ను తప్పించి వారి స్థానంలో జురెల్, నితీష్, తిలక్‌ను తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+