భారత జట్టులో ఆ లోపమే మాకు వరం, గెలిచి చూపిస్తాం- జింబాబ్వే సవాల్..!!
India vs Zimbabwe T20 World cup: టీ20 కప్ లో టీమిండియా సెమీస్ ఆశల పై ఇంకా స్పష్టత రావటం లేదు. దక్షిణాఫ్రికాతో ఓటమి తరువాత ఒక్క సారిగా అంచనాలు మారిపోయాయి. సూపర్ -8 లో మిగిలిన రెండు మ్యాచులు గెలవటంతో పాటు రన్ రేటు కీలకంగా మారుతోంది. అటు భారత్ ఆడాల్సిన జింబాబ్వే, వెస్టిండీస్ పూర్తి ఫాంలో ఉన్నాయి. ప్రధాన జట్లకే చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, భారత్ తో మ్యాచ్ కు ముందే జింబాబ్వే మైండ్ గేమ్ మొదలు పెట్టింది. భారత్ పైన గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసింది. టీమిండియా ఆట తీరు పైన తమ అంచనాలను వెల్లడించింది.
సూపర్ -8 దశ దాటి టీమిండియా సెమీస్ వెళ్లాలంటే జింబాబ్వే, వెస్టిండీస్ గండాలను దాటి వెళ్లాలి. అయితే, ఆ రెండు జట్లకు భారత్ తో మ్యాచ్ లు ఆదే స్థాయిలో కీలకం. జింబాబ్వే లీగ్ దశలో అందరి అంచనాలు దాటి సూపర్ -8 కు చేరింది. ఈ నెల 26న భారత్ తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సూపర్ -8 లో వెస్టిండీస్ తో తొలి మ్యాచ్ ఆడిన జింబాబ్వే 107 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. జింబాబ్వే పైన గెలవటంతో పాటుగా వెస్టిండీస్ టీం భారత్ ను సెమీస్ రేసు నుంచి మరింత వెనక్కు లాగేసింది. అయితే, ఈ ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్నా మని, భారత్‌తో జరిగే కీలక సూపర్-8 మ్యాచ్‌కు మరింత తెలివిగా సిద్ధమవుతామని జింబాబ్వే హెడ్ కోచ్ జస్టిన్ సమన్స్ అన్నారు. టీమిండియాతో సూపర్-8 పోరులో భారత్ పూర్తి దూకుడుతో బరిలోకి దిగుతుందని తనకు తెలుసని సమన్స్ తెలిపారు. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 83 పరుగు ల ఓటమి ఎదుర్కొన్నా.. భారత్ కూడా జింబాబ్వేపై దాడికి వెనకాడదని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్కువ అంచనా వేయటానికి వీళ్లేదు
వెస్టిండీస్ తో ఓటమి గురించి ఇక ఆలోచన చేయమని చెప్పారు. సెమీస్ లో రేసు కోసం భారత్ ఇక ఎలా ఆడుతుందో తమకు తెలుసని పేర్కొన్నారు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసిన విధంగానే భారత్ కూడా పూర్తి దూకుడుతో వస్తుందని.. వాళ్లు ఏమాత్రం వెనకడుగు వేయరని వివరించారు. అదే సమయంలో తమ జట్టు కూడా ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో పాఠాలు నేర్చు కుందని చెప్పారు.ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం, పరిస్థితికి అనుగుణంగా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని వివరించారు. బ్యాట్స్‌మన్‌ల రిథమ్‌ను మార్చేందుకు వ్యూహాల్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను అంగీకరిస్తూ, ముఖ్యంగా బౌలింగ్ విభాగం ప్రెడిక్టబుల్ గా మారిందని సమన్స్ ఒప్పుకున్నారు. భారత్ తో ఆడే చెన్నై మైదానం కొంచెం పెద్దది ఉంటుంది. అందువల్ల అక్కడ మా బౌలింగ్ వ్యూహాలను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభం లో ఇబ్బంది పడుతోందని.. అదే తమకు సరైన టైం అని చెప్పుకొచ్చారు. తాము సెమీస్ లో వెళ్లటమే తమ తొలి లక్ష్యమని తేల్చి చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications