Vinesh Phogat: వినేష్ ఫోగట్ అనర్హతపై తేల్చేసిన పీటీ ఉష- క్రీడాకోర్టు తీర్పుకు ముందే..!
పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరి కచ్చితంగా పతకం తెస్తుందని భావించిన మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే వినేష్ ఫోగట్ ఫైనల్ కు ముందు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉందనే కారణంతో అనర్హత వేటు పడగా.. అప్పటికే గెల్చుకున్న కాంశ్య పతకం కూడా పోగొట్టుకునే పరిస్ధితుల్లో క్రీడా కోర్టు (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)ను ఆశ్రయించి పోరాటం చేస్తోంది. అయితే అంతకు ముందు ఈ వివాదానికి బాధ్యత ఎవరిదో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తేల్చేశారు.
వినేష్ ఫోగట్ అధిక బరువు వివాదంలో ఏం జరిగిందో ఓవైపు క్రీడా కోర్టు విచారణ జరుపుతుండగా.. మరోవైపు ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష చేసిన వ్యాఖ్యలు మరో వివాదం రేపుతున్నాయి. వినేష్ ఫోగట్ బరువు వివాదానికి ఆమెతో పాటు కోచ్ మాత్రమే బాధ్యులని పీటీ ఉష వెల్లడించారు. ముఖ్యంగా ఆమె చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలా తీరు ఆమోదయోగ్యం కానిదని, ఖండించదగినది అని పీటీ ఉష పేర్కొన్నారు. మరోవైపు మాజీ ఒలింపిక్ సంఘం చీఫ్ నరేంద్ర బాత్రా కూడా డాక్టర్ పార్దివాలా, వారి టీమ్ పై విమర్శలు గుప్పించారు. వినేష్ ఆహారానికి ఆమె అనర్హత వేటుకు ఏదైనా సంబంధం ఉన్నట్లు ఆయన చెప్తున్నారు.

దీంతో ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చే లోపే భారత ఒలింపిక్ సంఘం పెద్దలు ఈ వివాదంలో తమపై ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకునేందుకు ముందే వినేష్ పోగట్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వినేష్ ఫోగట్ అనర్హత వేటు తర్వాత ఆటకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైంది. అయితే రెజ్లింగ్ సమాఖ్య, తోటి క్రీడాకారులు దీనిపై పోరాడాలని ఆమెకు సూచిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications