ఐపీఎల్‌ 2025కు సూపర్ స్టార్ డుమ్మా: మజా ఏముంటుంది?

Virat Kohli: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.

ఈ క్రమంలో ఆయా జట్లన్నీ కూడా ఇప్పటికే తమ రిటెన్షన్ ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి కూడా. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ఆకట్టుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్, కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా అయిదు మంది స్టార్ ప్లేయర్లు, ఆల్‌రౌండర్లు, గెలపుగుర్రాలను అట్టి పెట్టుకుంది.

IPL 2025 auction Ben Stokes likely to skips this season

ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు, మథీషా పథిరన- రూ.13 కోట్లు, శివం దుబే- 12 కోట్లు, రవీంద్ర జడేజా- 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ధోనీని అన్ క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్‌లోకి చేర్చింది. నాలుగు కోట్ల రూపాయలతో అతన్ని రిటైన్ చేసుకున్నట్లు వెల్లడించింది.

మరో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను కూడా వదులుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 2023 సీజన్‌లో సీఎస్‌కే తరఫు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు స్టోక్స్. ఆ తరువాత గాయం కారణంగా సీజన్ మొత్తానికీ దూరం అయ్యడు. అతని గైర్హాజర్ ఆ సీజన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఏడాది కూడా అతను డుమ్మా కొట్టాడు.

టీ20 వరల్డ్ కప్ 2024, ఆస్ట్రేలియాతో యాషెస్ టెస్ట్ సిరీస్‌ ప్రిపరేషన్స్ కోసం ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడలేదు. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. ఐపీఎల్ 2025 సీజన్‌కు కూడా బెన్ స్టోక్స్ ఆడకపోవచ్చు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2025 auction Ben Stokes likely to skips this season

ఇంగ్లాండ్ టెస్ట్ ఫార్మట్ కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు బెన్ స్టోక్స్. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది. లండన్‌లో జూన్ 11వ తేదీన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. స్వదేశంలో జరిగే ఈ ఫైనల్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఫైనల్స్ చేరడంపై కసరత్తు సాగిస్తోంద.

ఈ క్రమంలో బెన్ స్టోక్స్ పూర్తి ధ్యాస మొత్తం దానిపైనే ఉండటం వల్ల అదే జరిగే ఐపీఎల్ 2025కు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వేలం పాటకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు 43 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన బెన్ స్టోక్స్ 920 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. బౌలర్‌గా 28 వికెట్లు పడగొట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+