DC vs GT: ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా ? ఆ రెండు బాల్స్ ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పెరుగుతోందో, అంతే స్ధాయిలో వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గెలవాల్సిన మ్యాచ్ లు ఓడిపోతున్న జట్లు, అందులో ఆటగాళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈసారి ఐపీఎల్ (IPL 2026)లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్ మన్ గిల్ 70 పరుగులు, జోస్ బట్లర్ 52 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 55 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ లతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 రన్స్ చేసింది. తద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ముందు గౌరవ ప్రదమైన 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ 92 పరుగుల ఇన్నింగ్స్ తో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది.

కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 134 రన్స్ కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు డేవిడ్ మిల్లర్ చేతి గాయం కావడంతో రిటైర్డ్ హర్డ్ గా వెనుదిరగడం, తిరిగి చివర్లో గ్రౌండ్ లో అడుగుపెట్టి మ్యాచ్ గెలిపించేందుకు ప్రయత్నించడం ఆకట్టుకున్నాయి. అయితే చివరి ఓవర్లో చోటు చేసుకున్న పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇందులో మిల్లర్ లాంగ్-ఆఫ్ వైపు కొట్టిన షాట్ సరిగ్గా బౌండరీ మీద పడింది, అది ఫోరా లేక సెక్సా అనేది స్పష్టం కాకముందే రీప్లే చూపించకుండానే అంపైర్ హడావిడిగా దాన్ని ఫోర్‌గా ప్రకటించాడు. అలాగే రెండు బంతుల్లో 2 పరుగులు కావాల్సిన దశలో సులభంగా పరుగెత్తే అవకాశం ఉన్నా డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఆ పరుగు తీసి ఉంటే ఆ క్షణంలో మ్యాచ్ టై అయ్యేది, ఫలితం తర్వాత తేలిపోయేది. అయినా మిల్లర్ పరుగెత్తకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగే చివరి బంతికి పరుగు రాదని తెలిసి పరిగెత్తి కుల్దీప్ యాదవ్ రనౌట్ కు కారణం కావడం కూడా ఫిక్సింగ్ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications