IPL 2026: రెచ్చిపోయిన ఫిన్ అలెన్.. ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ వేదికగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ అవకాశాలను కేకేఆర్ సజీవంగా ఉంచుకోగా.. ఢిల్లీ కథ ముగిసింది.
టోర్నీ ఆరంభంలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన కేకేఆర్ అనూహ్యంగా పుంజుకొని సత్తా చాటుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితుల్లో ఒక్కోటి గెలుస్తూ లక్ష్యానికి చేరువవుతోంది. ఫిన్ అలెన్(47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

ఫిన్ అలెన్ ఊచకోత..
అతని విధ్వంసంతో 143 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 14.2 ఓవర్లలోనే ఛేదించింది. 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి 34 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఫిన్ అలెన్‌తో పాటు కామెరూన్ గ్రీన్(27 బంతుల్లో 2 సిక్స్‌లతో 33 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్‌కు మాత్రమే ఒక వికెట్ దక్కింది. విన్నింగ్ షాట్‌గా సిక్సర్ బాదిన ఫిన్ అలెన్.. 47 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 10 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసాడు.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అషుతోష్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
దెబ్బతీసిన అనుకూల్ రాయ్..
ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. 5 ఓవర్లలో 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔటైనా.. పాతుమ్ నిస్సంగా చెలరేగాడు.
అయితే పవర్ ప్లే అనంతరం ఢిల్లీ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. నితీష్ రాణ(8), సమీర్ రిజ్వీలను వరుస ఓవర్లలో గ్రీన్, నరైన్ ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాతుమ్ నిస్సంకతో పాటు డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్(2)లను అనుకూల్ రాయ్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ కోలుకోలేకపోయిది. వేగంగా ఆడలేక స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.












Click it and Unblock the Notifications