టీమిండియా హెడ్ కోచ్‌గా ఆయనను ఒప్పించే బాధ్యత ధోనీకి అప్పగింత
Rahul Dravid: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియబోతోంది. ఆయన స్థానంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అన్వేషణ మొదలు పెట్టింది. టీ20 వరల్డ్ కప్ 2024 తరువాత దీనికి సంబంధించిన ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయనుంది.ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆడబోతోంది టీమిండియా. ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్స్ ముగిసిన వారం రోజుల తరువాత అంటే జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. ఈ టీ20 వరల్డ్ కప్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ- రాహుల్ ద్రావిడ్‌కు మాత్రం ఉద్వాసన తప్పదు.రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగిసిన అనంతరం దాన్ని రెన్యూవల్ చేయదలచుకోలేదు బీసీసీఐ. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానించింది కూడా. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

ఈ హెడ్ కోచ్ పదవికి డిమాండ్ ఉంటుందని ఆశించినప్పటికీ.. దానికి భిన్నమైన వాతావరణం నెలకొంది. టీమిండియా మాజీ ప్లేయర్లు, స్వదేశీ ఆటగాళ్లెవరూ కూడా పెద్దగా హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి చూపట్లేదు. దరఖాస్తు దాఖలు చేసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోన్నారు.హైదరాబాద్‌కు చెందిన మాజీ టెస్ట్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం హెడ్ కోచ్ పదవిపై ఏ మాత్రం ఆసక్తిగా ఉండట్లేదని తెలుస్తోంది. ఇదివరకు తాత్కాలికంగా టీమిండియాకు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉందాయనకు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చీఫ్‌గా వ్యవహరిస్తోన్నారు లక్ష్మణ్. దీన్ని కాదనుకుని హెడ్ కోచ్‌గా దరఖాస్తు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
రాహుల్ ద్రావిడ్ సైతం మరోసారి ఇదే పదవికి అప్లికేషన్ పెట్టడానికీ ఇంట్రస్ట్‌గా లేరు. ఒకసారి హెడ్ కోచ్‌గా చేసిన వారు మరోసారి అదే పదవికి అప్లై చేయకూడదనే నిబంధన అంటూ బీసీసీఐలో ఏదీ లేదు. కావాలనుకుంటే రాహుల్ ద్రావిడ్ కూడా ఈ పోస్ట్‌కు మళ్లీ అప్లై చేసుకోవచ్చంటూ బీసీసీఐ స్పష్టం చేసింది కూడా. అయినప్పటికీ- ద్రావిడ్ మాత్రం దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై కన్నేసింది బీసీసీఐ. అతన్ని టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించడంపై ఆసక్తి చూపుతోంది. ఐపీఎల్‌లో సీఎస్‌కేను మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా మలిచిన రికార్డ్ ఫ్లెమింగ్ సొంతం. అందుకే అతన్ని రాహుల్ ద్రావిడ్ వారసుడిగా నియమించాలని భావిస్తోంది.

స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం ఆసక్తి చూపట్లేదు. ఇప్పటివరకు దరఖాస్తు కూడా చేసుకోలేదతను. మొన్నటివరకు ఐపీఎల్ 2024తో తీరిక లేకుండా గడిపారు. సీఎస్‌కే ప్లేఆఫ్స్ నుంచి వైదొలగిన నేపథ్యంలో కొంత వరకు ఫ్లెమింగ్ ఫ్రీ అయినట్టే. ఫైనల్స్ ముగిసిన తరువాత తన స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడీ న్యూజిలాండ్ మాజీ కేప్టెన్.ఈ లోగా- టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ.. సీఎస్‌కే మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించింది. ఎలాగైనా సరే అతనితో అప్లికేషన్ పెట్టుకునేలా చేయాలంటూ ఇప్పటికే ధోనీని సైతం సంప్రదించినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది.
స్టీఫెన్ ఫ్లెమింగ్ ససేమిరా అంటే మాత్రం ప్రత్యామ్నాయంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, ఆస్ట్రేలియా మాజీ కేప్టెన్ రికీ పాటింగ్, జస్టిన్ లాంగర్, శ్రీలంక మాజీ బ్యాటర్ జయవర్ధనే దరఖాస్తులను బీసీసీఐ పరిశీలిస్తుంది. వారిలో ఒకరిని ఎంపిక చేసుకుంటుంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications