ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!?

IPL 2026 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సమయంలో అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారు అయ్యారు. ముంబాయి ఇండియన్స్ లో మాత్రం కొత్త వివాదం మొదలైంది. టీం కెప్టెన్ మార్పు పైన కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు రంగంలోకి దిగుతున్నారు. తమ మద్దతు ఎవరికో స్పష్టం చేస్తున్నారు. దీంతో.. ఐపీఎల్ ప్రారంభం వేళ ఈ వివాదం జట్టుకు సమస్య గా మారుతోంది. ఇద్దరు కీలక ప్లేయర్ల కు మద్దతుగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. దీంతో.. ఫైనల్ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.

ఐపీఎల్ 2026 ప్రారంభం వేళ ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ ద్వారా హార్దిక్ ముంబాయి ఇండియన్స్ కు వచ్చాడు. దీంతో, అప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. అది తీవ్ర చర్చనీయాంశం అయింది. నాటి నుంచి నేటి వరకు ఆ వివాదం సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్, టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'దేశానికి రెండు ప్రపంచ కప్‌లు అందించిన కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ ఉన్న జట్టుకు హార్దిక్ పాండ్యను కెప్టెన్‌ చేయడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. టీం మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు కలిసి భవిష్యత్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కెప్టెన్సీ వివాదం సద్దుమణిగిందని అనుకోవడానికి లేదని ..అయితే హార్దిక్ తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని వ్యాఖ్యానించారు.

kris-srikkanth-backs-suryakumar-yadav-as-mumbai-indians-captain-over-hardik-pandya-ahead-of-ipl-2026

పాండ్యా తప్పుకోవాలి.. సూర్య కు ఛాన్స్ ఇవ్వాలి

'నాకు కెప్టెన్సీ వద్దు.. సూర్యనే ఎంఐకి నాయకత్వం వహించాలి' అని స్వయంగా అతడే చెప్పాలి. అప్పుడే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి' అని క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత జట్టుకు ట్రోఫీ అందలేదు. 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి హైప్రొఫైల్ ట్రేడ్ ద్వారా ఎంఐకు వచ్చిన హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆ నిర్ణయం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ సీజన్‌లో జట్టు తుది స్థానంలో నిలవడం విమర్శలకు తావిచ్చింది. 2025లో ప్లే ఆఫ్స్‌కు చేరినా టైటిల్ సాధించలేకపోవడంతో కెప్టెన్సీపై మళ్లీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌కు విజయం అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉండటం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ క్రమంలో క్రిస్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. టోర్నీ ప్రారంభం వేళ ఏదైనా మార్పు ఉంటుందా.. హార్దిక్ కొనసాగుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+