భారత్ సెమీస్ చేరాలంటే ఆ జట్టుతోనే అసలు ప్రమాదం..!!

T20 World cup: టీమిండియా సెమీస్ చేరుతుందా. ఈ రోజు రెండు మ్యాచుల తరువాత సెమీస్ పైన స్పష్టత రానుంది. అటు దక్షిణాఫ్రికా టాస్ గెలిచి వెస్టిండీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే భారత్ కు కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఇక.. జింబాబ్వేతో భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. గెలుపు కాదు.. అంత కంటే అనే స్థాయిలో ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంది. కాగా.. ఇప్పుడు భారత్ సెమీస్ లెక్కల వేళ మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ చేరాలంటే ఈ రోజు జరిగే జింబాబ్వేతో మ్యాచులో అదే విధంగా మార్చి 1న వెస్టిండీస్ తో జరిగే మ్యాచులోనూ భారీ విజయం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక.. ప్రస్తుతం వెస్టిండీస్ - సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితం కూడా టీమిండియా సెమీస్ అవకాశం పైన ప్రభావం చూపనుంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్లు వెస్టిండీస్ టాప్ ఆర్డర్ ను తక్కువ స్కోరుకే ఒకరి తరువాత మరొకరిని పెవిలియన్ కు పంపుతున్నారు. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే భారత్ కు అవకాశాలు మెరుగు పడతాయి. అయితే, రన్ రేటు ఇప్పుడు టీమిండియా కు కీలకంగా మారుతోంది. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో టీమిండియా ప్రస్తుతం ఉన్న మైనస్ రన్ రేటు నుంచి మంచి రన్ రేటు సాధించటంతో పాటుగా పాయింట్ల పట్టికలో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాలి. కాగా.. జింబాబ్వేతో మ్యాచ్ వేళ మాజీ క్రికెటర్ శ్రీకాంత్ చేసిన విశ్లేషణ ఆసక్తి కరంగా మారుతోంది.

kris-srikkanth-mentioned-that-zimbabwe-can-be-a-tricky-opponent-for-india-at-chepauk

ఈ రోజు మ్యాచుల తరువాత స్పష్టత

మాజీ క్రికెటర్ శ్రీకాంత్ భారత్ జట్టుకు కీలక అలర్ట్ ఇచ్చారు. ప్రపంచ కప్ లో ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచులు కీలకంగా మారటంతో ఇప్పుడు ప్రతీ ఆటగాడి పైన బాధ్యత ఉందని చెప్పారు. అయితే, వెస్టిండీస్ కంటే ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న జింబాబ్వే డేంజర్ టీం అని శ్రీకాంత్ ఆ టీం సామర్ధ్యం గురించి చెప్పుకొచ్చారు. టీమిండియా పైన ఒత్తిడి ఉందని.. దీంతో, జింబాబ్వే పూర్తిగా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని విశ్లేషించారు. సెమీస్ అవకాశం వెస్టిండీస్ కు ఎక్కువగా ఉందని వివరించారు. దీంతో.. ఒత్తిడి వదిలేస్తేనే టీమిండియా సెమీస్ వైపు వెళ్లటానికి రూటు క్లియర్ అవుతుందని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ మ్యాచు ఫలితం కూడా ప్రభావం చూపనుంది. వెస్టిండీస్ గెలిస్తే మొత్తం లెక్కలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. ఈ రోజు రెండు మ్యాచుల ఫలితం తరువాత సెమీస్ సమీకరణాల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+