Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహ్మద్ షమీ రియల్ హీరో: రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిని రిస్క్ చేసి రక్షించాడు

డెహ్రాడూన్: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా ఆడిన ప్లేయర్.. మహ్మద్ షమీ (Mohammed Shami). ఈ టోర్నమెంట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయ పడటం వల్ల జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఈ వరల్డ్ కప్‌లోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.

టోర్నమెంట్ మొత్తం మీద ఏడు మ్యాచ్‌లను మాత్రమే ఆడిన షమీ.. 24 వికెట్లు నేలకూల్చాడు. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్లను పడగొట్టి తన సత్తా చాటాడు. అంతకుముందు కూడా నాలుగుకు తక్కువ కాకుండా వికెట్లను పడగొట్టాడు. వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లను పడగొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు.

Mohammed Shami saves motorist in Nainital

ఇప్పుడు మరోసారి హీరోగా నిలిచాడు షమీ (Shami). ఉత్తరప్రదేశ్‌లోని నైనిటాల్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువకుడిని సకాలంలో రక్షించగలిగాడు. దీనికోసం ఎంతో రిస్క్ చేశాడీ ఫాస్ట్ బౌలర్. వారికి ఫస్ట్ ఎయిడ్‌ను అందించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను షమీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ వద్ద ఈ ఘటన సంభవించింది. తన స్వస్థలం అమ్రోహా నుంచి నైనిటాల్ వెళ్తోన్న సమయంలో అతని ఎదురుగా వెళ్తోన్న కారు ఒకటి.. అదుపు తప్పింది. మలుపులో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఓ చిన్నపాటి గుంతలో పడి చెట్టును ఢీ కొట్టి అక్కడే ఆగిపోయింది.

దీన్ని గమనించిన మహ్మద్ షమీ.. తన స్నేహితులతో కలిసి రంగంలోకి దిగాడు. తోటి వాహనదారుల సహాయంతో రోడ్డు కిందికి దిగి ఆ కారు డ్రైవర్‌ను బయటికి తీసుకొచ్చాడు. అదృష్టవశావత్తూ అతనికి పెద్దగా గాయాలేవీ కాలేదు. చేతి వేళ్లకు దెబ్బలు తగలడంతో ఫస్ట్ ఎయిడ్ అందించాడు షమీ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+