MS Dhoni-CSK: ధోనీ -సీఎస్కే బంధానికి బీటలు ? కొత్త పాత్రపై చర్చలు విఫలం..!

టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గత సీజన్ కు దూరం కావడం, వచ్చే సీజన్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న చర్చ జరగాల్సిన పరిస్ధితుల్లో ఆయన భారీ ట్విస్ట్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో ధోనీ జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. సీఎస్కేలో ధోనీ కొత్త పాత్రపై జరిగిన ఈ చర్చల వైఫల్యం తర్వాత ప్రతిష్టంభన నెలకొంది.

ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం సాగుతోంది. ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు సంబంధించిన చర్చలు విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణమని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి సీఎస్‌కేతో అనుబంధం కలిగిన ధోనీ.. ఇప్పుడు యాజమాన్యంలో చేరాలని భావిస్తున్నాడు. అలాగే తన వాటాపైనా ఫ్రాంచైజీకి ఆఫర్ ఇచ్చి చర్చలు కూడా జరిపాడు. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సీఎస్కేతో ధోనీ బంధం కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది.

MS Dhoni-CSK Stake Deal Hits Deadlock After Talks With Team Management Fail

మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా సీఎస్కేతో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ధోనీ యోచించాడు. ఇందులో భాగంగానే ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు చేసి భాగస్వామిగా మారాలని కోరుకున్నాడు. అయితే ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్ ఫలించలేదని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ బేరసారాలు కేవలం మాటల వరకే పరిమితమయ్యాయి తప్ప ఎలాంటి లిఖితపూర్వక ప్రతిపాదనలు చేసుకోలేదని తెలుస్తోంది. క్రిక్‌బ్లాగర్ రిపోర్ట్ ప్రకారం ధోనీ మొదట సీఎస్కేలో 25 శాతం వాటాను కొనుగోలు చేయాలని భావించాడు. కానీ యాజమాన్యం కేవలం 3 శాతం వాటాను మాత్రమే ఆఫర్ చేసింది. ఆ తర్వాత ధోనీ తన ప్రతిపాదనను 20 శాతానికి తగ్గించగా, లీగ్ యాజమాన్యం దానిని 4 శాతానికి పెంచింది. చివరి ప్రయత్నంగా ధోనీ 18 శాతం వాటాకు మొగ్గు చూపినప్పటికీ, సీఎస్‌కే యాజమాన్యం గరిష్ఠంగా 5.5 శాతం మాత్రమే ఇవ్వగలమని తేల్చి చెప్పేసింది. దీంతో ధోనీ ధోనీకి సీఎస్కే జట్టు తరఫున బరిలోకి దిగడంపై అనుమానాలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+