T20 World Cup: బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ అవుట్ ? పీసీబీ ఛీఫ్ హింట్..!
భారత్ లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ పై ఐసీసీ ఇవాళ అధికారికంగా వేటు వేసింది. బంగ్లాదేశ్ స్ధానంలో స్కాట్లండ్ కు వరల్డ్ కప్ లో ఆడే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ (pakistan) రంగంలోకి దిగింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్తాన్ కూడా ఈ మెగా టోర్నీని బహిష్కరించే ఆలోచనల్లో ఉందన్న ప్రచారం ఊపందుకుంది.
భారత్ లో ఆడని బంగ్లాదేశ్ ను టీ20 వరల్డ్ కప్ నుంచి సాగనంపిన ఐసీసీపై పీసీబీ ఛీఫ్ మొహసిన్ నక్వీ మండిపడ్డారు. ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అనుమతించాలని నఖ్వీ కోరారు. ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడం తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై తమ వైఖరి పాకిస్తాన్ ప్రభుత్వం తనకు సూచించిన విధంగా ఉంటుందన్నారు.

ప్రస్తుతం తమ ప్రధానమంత్రి పాకిస్తాన్‌లో లేరని, ఆయన తిరిగి వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయం, మేము వారికి కట్టుబడి ఉంటామన్నారు. ఐసీసీకి కాదన్నారు. పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ బాయ్ కాట్ చేస్తే ప్లాన్ బీ ఉందా అని అడిగితే తమ వ్యూహాలు తమకు ఉన్నాయని నక్వీ తెలిపారు. పాకిస్తాన్, భారత్ మాదిరిగానే బంగ్లాదేశ్ కూడా ఐసీసీ పూర్తి సభ్య దేశం కాబట్టి వారికి కూడా అదే న్యాయం ఉండాలని నఖ్వీ అన్నారు. మరొక దేశంపై నిబంధనలను నిర్దేశించడానికి ఏ దేశాన్ని అనుమతించకూడదని పీసీబీ చీఫ్ తెలిపారు. దీనికి అనుమతిస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా తమ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. మరోవైపు టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఉన్న భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ ఉంది.












Click it and Unblock the Notifications