Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023: సెమీస్ లో గెలుపెవరది, విశ్వ విజేత ఎవరు - పాక్ లెజెండ్ లెక్క ఇలా..!!

ప్రపంచ కప్(World Cp 2023) సమరం కీలక దశకు చేరుకుంది. సెమీస్ లో తలపడే నాలుగు జట్ల దాదాపు ఫైనల్ అయ్యాయి. తొలి సెమీస్ లో భారత్ వర్సస్ కివీస్, రెండో సెమీస్ లో ఆసీస్ వర్సస్ సఫారీల మధ్య జరగనున్నాయి. తొలి సెమీస్ లో న్యూజీలాండ్ ను భారత్ ఎదుర్కోనుండటం ఆసక్తి కరంగా మారుతోంది. 2019 ప్రపంచ కప్ ఫలితాలు ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ కప్ విజేతగా ఎవరు నిలుస్తారనే అంశం పైన పాక్ లెజండ్ మహ్మద్ యూసఫ్ తన అంచనాలను వెల్లడించారు.

సెమీస్ తో మారుతున్న లెక్కలు:మహ్మద్ యూసఫ్ పాకిస్తాన్ టీం కోసం 381 మ్యాచ్ లు ఆడారు. జట్టుకు అనేక సందర్భాల్లో విజయాలు అందించారు. టీంకు ప్రతీ టోర్నీలో సూచనలు..సలహాలు అందిస్తూ ఉంటారు. ప్రపంచ కప్ సమరంలో నూ జట్టుకు అండగా నిలిచారు. ఇటువంటి మహ్మద్ యూసఫ్ ప్రస్తుత ప్రపంచ కప్ లో మారుతున్న సమీకరణాల పైన ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఇప్పుడు సెమీస్ బెర్తులు ఖాయమయ్యాయి. పాకిస్థాన్ కు సెమీస్ చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అనూహ్య విజయం నమోదైతే మినహా ఇక ఛాన్స్ లేనట్లే. ఈ సమయంలో సెమీస్ లో భారత్ వర్సస్ న్యూజీలాండ్ సమరం పైనే ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. 2019 లో జరిగిన దానికి ప్రతీకారం భారత్ తీర్చుకుంటుందంటూ ఫ్యాన్స్ పోస్టింగ్స్ పెడుతున్నారు.

Pakistan legend Mohammad Yousuf Predicts on World cup 2023 winner

టీమిండియా పై భారీ అంచనాలు:ఇదే సమయంలో న్యూజీలాండ్ టీం సైతం చాలా బలంగా ఉంది.దీంతో, అసలు సెమీస్ ఎవరు గెలుస్తారనే చర్చ వేళ మహ్మద్ యూసఫ్ తన అంచనాలను వెల్లడించారు. ఇది రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లుగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ టోర్నీలో తొలి నుంచి ఒకే టీం ముందు నిలిచిందని భారత్ గురించి చెప్పుకొచ్చారు. అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు, అగ్రశ్రేణి ఫీల్డింగ్‌ తో భారత్ తొలి స్థానంలో నిలిచిందన్నారు. టీంగా మొత్తంగా భారత్ ప్రదర్శన బాగుందని కితాబిచ్చారు. ఒక యూ ట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన యూసఫ్ టీమిండియా కోచ్ ద్రావిడ్ - కెప్టెన్ రోహిత్ శర్మ పైన ప్రశంసలు కురిపించారు. ఏ ప్లేయర్ ను ఎలా వాడుకోవాలో..జట్టు ప్రయోజనం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాగే వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.

భారత్ కు కలిసొచ్చే అంశాలు:ఈ సమీకరణాలతో భారత్ ప్రపంచకప్ ఫేవరెట్ టీంగా మహ్మద్ యూసఫ్ అంచనా వేసారు. అన్ని లెక్కలు భారత్ కు కలిసి వస్తున్నాయని విశ్లేషించారు. సొంత గడ్డ పైన భారత్ బ్యాటర్లు..బౌలర్ల ప్రతిభ ఎంత ప్రశంసించినా తక్కవేనని వివరించారు. సెమీస్ కు చేరిన మిగిలిన మూడు జట్లు బలమైనవే అయినా అన్ని పరిస్థితులు భారత్ కు అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మొత్తంగా మహ్మద్ యూసఫ్ ఈ ప్రపంచ కప్ ను భారత్ గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇప్పుడు యూసఫ్ చేసిన విశ్లేషణ వైరల్ అవుతోంది. ఇక, ఈ నెల 15న ముంబాయిలో జరిగే తొలి సెమీస్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి గా నిరీక్షిస్తున్నారు. ఈ నెల 19న అహ్మదాబాద్ లో ప్రపంచ కప్ ఫైనల్ సమరం జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+