హైదరాబాద్‌కు టీమ్ పాకిస్తాన్: ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో
ఇస్లామాబాద్: భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనను విజయవంతంగా ముగించుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో లంక జట్టును చిత్తు చేసింది. 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆసియా కప్ 2023 ఛాంపియన్‌గా ఆవిర్బవించింది. టీమిండియా ఈ కప్‌ను గెలవటం ఇది ఎనిమిదోసారి.
ఇక భారత జట్టు ముందు బిగ్గెస్ట్ టాస్క్ ఉంది. ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో ఆడాల్సి ఉంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన.

ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో తలపడుతుంది. నెదర్లాండ్స్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ మెగా టోర్నీలో ఆడటానికి పాకిస్తాన్ జట్టు.. భారత్‌కు రానుంది. సుదీర్ఘ విరామం అనంతరం పాక్ జాతీయ జట్టుకు భారత్‌కు రాబోతోండటం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, ఇటు బీసీసీఐ.. ద్వైపాక్షిక సిరస్‌లను నిర్వహించట్లేదు. ఐసీసీ లేదా ఏసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.
ఇందులో భాగంగా ఐసీసీ వరల్డ్ కప్ ఆడటానికి పాకిస్తాన్ జట్టు భారత్‌కు రానుంది. ఈ నెల 25వ తేదీన ఆ జట్టు భారత్‌కు ప్రయాణమౌతుంది. తొలుత దుబాయ్‌కు వెళ్తుంది. అక్కడ రెండు రోజుల విశ్రాంతి అనంతరం భారత్‌కు చేరుకుంటుంది. దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వస్తుంది కేప్టెన్ బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్ జట్టు.
అక్టోబర్ 6వ తేదీన తన తొలి మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్. నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 10వ తేదీన శ్రీలంక, 14వ తేదీన భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలోనే వెనుదిరిగిన నేపథ్యంలో బాబర్ ఆజమ్ జట్టు వరల్డ్ కప్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications