T20 World Cup:2026 భారత్ తో ఆడరు సరే.. గ్రూప్ దాటాలంటే..?
రేపు భారత్-శ్రీలంక సంయుక్త వేదికలుగా పురుషుల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా భావించిన ఇండియా-పాకిస్తాన్ (india pakistan match) మ్యాచ్ లేదనే విషయం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఇప్పటికే భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరించి టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ జట్టు (pakistan) భారత్ (india)తో ఆడేందుకు నిరాకరించడమే. అయితే ఈ ఒక్క మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ కు ఏం జరగబోతోందనేది ఇప్పుడు కీలకం.
ఈ మెగా టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఇవన్నీ నాలుగు గ్రూపులుగా విడిపోయి, ఒక్కో గ్రూపులో ఐదుగురు చొప్పున పోటీ పడతారు. అనంతరం ఇందులో నుంచి తలో రెండు జట్ల లెక్కన మొత్తం 8 జట్టు సూపర్ 8కు చేరతాయి. ఇందులో మళ్లీ ఎక్స్, వై పేరుతో రెండు గ్రూపులుంటాయి. ఒక్కో గ్రూపులో ఉన్న నాలుగు జట్లలో టాప్ 2 చొప్పున మొత్తం 4 జట్లు 2 సెమీ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. చివరిగా రెండు సెమీ ఫైనళ్లలో నుంచి రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. అక్కడ గెలిచే జట్టుకు ట్రోఫీ లభిస్తుంది.

ఇప్పుడు గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. ఈ ఐదు జట్లలో ప్రతీ జట్టూ గ్రూప్ దశలో
మిగిలిన నాలుగు జట్లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. అందులో ఎక్కువ మ్యాచ్ లు గెలిచిన రెండు జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అయితే ఇందులో పాకిస్తాన్ మాత్రం భారత్ తో మ్యాచ్ ఆడనంటోంది. అదే జరిగితే భారత్ కు అదనపు పాయింట్లు లభిస్తాయి. అలాగే పాకిస్తాన్ సూపర్ 8కు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు జట్లు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాపై కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడే సూపర్ 8కు అన్ని మ్యాచ్ లు గెలుస్తుందని భావిస్తున్న భారత్ తో పాటు అర్హత సాధిస్తుంది. లేకపోతే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం పాకిస్తాన్ ఫామ్ బట్టి చూస్తే తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. అలాగే జట్టు ప్రధానంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మీద, స్పిన్నర్ల మీదే ఆధారపడుతోంది. మరోవైపు పాకిస్తాన్ అటతీరు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. గత టీ20 వరల్డ్ కప్ లో ఇదే అమెరికా జట్టు చేతిలో ఓటమిపాలైంది కూడా. అలాగే నెదర్లాండ్స్ కు కూడా గతంలో దక్షిణాఫ్రికా వంటి మేటి జట్లను ఓడించిన చరిత్ర ఉంది. కాబట్టి పాకిస్తాన్ అన్ని మ్యాచ్ లు గెలవక తప్పదు. చివరిగా శ్రీలంకలో మ్యాచ్ లకు వర్షం ముప్పు కూడా పొంచి ఉండటం ఆ జట్టును కలవరపెడుతోంది.
-
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..!












Click it and Unblock the Notifications