గుడ్ బై చెప్పిన పాట్ కమ్మిన్స్ భార్య
MI vs SRH: ఐపీఎల్ 2025లో తన పరాజయాల ప్రస్థానాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనసాగిస్తూనే వస్తోంది. ముంబై ఇండియన్స్‌పై మరో ఓటమిని చవి చూసింది. మున్ముందు కఠిన సవాళ్లను ఎదుర్కోనున్న పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరడానికి తలకిందులుగా తపస్సు చేయక తప్పని పరిస్థితిలో పడింది.
వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేక పోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ- 40, ట్రావిస్ హెడ్- 28 పరుగులతో తొలి వికెట్ భాగస్వామ్యానికి 59 పరుగులను అందించినప్పటికీ- దాన్ని భారీ స్కోర్‌గా మలచుకోలేకపోయింది.

ఇషాన్ కిషన్ మరోసారి చేతులెత్తేశాడు. రెండు పరుగులకే పరిమితం అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి- 19, హెన్రిచ్ క్లాసెన్- 37, అనికేత్ వర్మ- 18, పాట్ కమ్మిన్స్- 8 పరుగులు చేశారు. బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ- భారీ ఇన్నింగ్, దానికి తగ్గ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలం అయ్యారు.
ముంబై ఇండియన్స్ కట్టుదిట్టంగా బంతులు సంధించారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 59 పరుగులు జమ అయినప్పటికీ దాన్ని ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోర్‌గా మలచుకోలేకపోవడానికి అదే ప్రధాన కారణం. వాంఖడే స్టేడియం స్లోయర్ కావడం వారికి కలిసొచ్చింది. తరచూ బౌలింగ్ పేస్ మార్చారు ముంబై బౌలర్లు. సమయానుకూలంగా బౌలింగ్ చేశారు. దూకుడుగా ఆడటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన 20వ ఓవర్‌లో మాత్రమే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకోగలిగారంతే. ఈ రెండు ఓవర్లే జట్టు స్కోర్‌ను 160ని దాటించగలిగాయి. దీపక్ చాహర్ బౌలింగ్‌లో 21, పాండ్యా బౌలింగ్‌లో 22 పరుగులు రాబట్టుకున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఒంటరిపోరాటం చేశాడు కేప్టెన్ పాట్ కమ్మిన్స్. వన్ మ్యాన్ షో కనిపించిందిక్కడ. అటు బ్యాటర్‌గా, ఇటు బౌలర్‌గా సత్తా చాటాడు. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు.
తోటి బౌలర్లు ఘోరంగా విఫలమౌతోండగా.. పాట్ కమ్మిన్స్ మాత్రం వికెట్లను తీస్తూ వచ్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. 16 బంతుల్లో మూడు భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మను పెవిలియన్ దారి పట్టించాడు. ఆ తరువాత విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్‌ను బలి తీసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాట్ కమ్మిన్స్ భార్య బెక్కీ బోస్టన్ స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటానికి ఆమె ఇటీవలే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గుడ్ బై ఇండియా, అందమైన ఈ దేశాన్ని సందర్శించడం మాకు చాలా ఇష్టం.. అంటూ చెప్పారు. పాట్ కమ్మిన్స్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను దీనికి జత చేశారు.
Pat Cummins wife on Instagram:
— Johns. (@CricCrazyJohns) April 18, 2025
"Goodbye India, we have loved visiting this beautiful country". 🇮🇳🤍 pic.twitter.com/Zvn3cXH9tH
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications