Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది!

PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఆరంభమే కామెడీని తలపిస్తోంది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఓ వింత పరిస్థితి ఎదురైంది.స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం, వీఐపీల హంగామా వంటి వివాదాలు సరిపోవన్నట్లు.. ఇప్పుడు ఏకంగా బంతి రంగు మారిపోవడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. ఆట సాగుతుండగానే తెల్లటి బంతి కాస్తా గులాబీ రంగులోకి.. ఆపై ఎర్రగా మారిపోయింది. దీనికి కారణం హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాళ్లు ధరించిన జెర్సీల రంగు బంతికి అంటుకోవడమే. సాధారణంగా బంతిని మెరిపించడానికి ప్లేయర్లు తమ దుస్తులకు రుద్దుతుంటారు. అలా రుద్దినప్పుడు జెర్సీ రంగు బంతికి అంటుకుని అది రంగు మారిపోయింది.

ఫిర్యాదు చేసిన లబుషేన్.. అంపైర్లు షాక్!
హైదరాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ ఈ విషయాన్ని గమనించి వెంటనే అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. "నా కెరీర్లో బంతి రంగు ఇలా మారిపోవడం ఎప్పుడూ చూడలేదు" అని లబుషేన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సాధారణంగా బ్యాట్ లేదా ప్యాడ్ తగిలితే కొంచెం రంగు అంటుకుంటుంది.. కానీ ఇలా జెర్సీ వల్ల బంతి కలర్ మారడం అత్యంత అసాధారణమని లబుషేన్ పేర్కొన్నాడు. పరిస్థితిని గమనించిన అంపైర్లు వెంటనే బంతిని మార్చాల్సి వచ్చింది.

PSL 2026 White Ball Turns Pink Due to Jersey Color Marnus Labuschagne Complains Amid Trolls

నెట్టింట ట్రోల్స్.. పింక్ బాల్ మ్యాచ్ అంటూ సైటైర్లు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఉతికారేస్తున్నారు. "అంతర్జాతీయ స్థాయి లీగ్‌లో ఇంత నాసిరకం జెర్సీలు వాడుతారా!" అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయినప్పటికీ హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా వ్యంగ్యంగా స్పందించింది. "పీఎస్ఎల్ చరిత్రలోనే తొలి పింక్ బాల్ మ్యాచ్ గెలిచినందుకు ప్రత్యర్థి జట్టుకు అభినందనలు" అంటూ పోస్ట్ చేయడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది.

లాహోర్ ఘనవిజయం
ఈ రంగుల గందరగోళం మధ్య జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు 69 పరుగుల తేడాతో హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేయగా.. లక్ష్య చేదనలో హైదరాబాద్ జట్టు కేవలం130 పరుగులకే పరిమితం అయింది. లాహోర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (53 పరుగులు) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+