వినేష్ ఫొగాట్‌దే తప్పు..మొత్తానికి తేల్చేశారుగా..!
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. తన అనర్హతను సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)ను ఆశ్రయించిన వినేశ్.. రజతం ఇవ్వాలని అభ్యర్థించింది. వినేశ్ అప్పీలుపై విచారణ చేపట్టిన సోలో ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్(ఆస్ట్రేలియా) తీర్పును ఈ నెల 13కు వాయిదా వేసింది. వినేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని భారత ఒలింపిక్ సంఘం ఆశిస్తున్నది. కాస్ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేస్తామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.
ఇదిలా ఉంటే బరువు పెరగడంలో వినేశ్ ఫొగట్‌దే తప్పని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్ పీటీ ఉష తేల్చేశారు. వినేష్ ఫోగట్ బరువు పెరగకుండా చూసుకోలేదని.. భారత ఒలింపిక్ సంఘం, మెడికల్ టీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన పీటీ ఉష బరువు పెరగడంలో వినేష్ ఫోగట్‌తో పాటు ఆమె వ్యక్తిగత కోచ్‌లు, సహాయక సిబ్బందిదే తప్పు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వినేష్ ఫోగట్ బరువు పెరగడంలో మెడికల్ టీమ్ తప్పిదం ఎంత మాత్రం లేదని పీటీ ఉష స్పష్టం చేశారు.

మెడిలక్ టీమ్.. అథ్లెట్లు గాయపడితే.. వారు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సాయం అందించడం, గాయంపై అవగాహన కల్పిస్తారు తప్పా.. వారి బరువు, డైట్, ట్రైనింగ్‌ను పర్యవేక్షిందంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. కోచ్‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయని, బరువు, ఫిట్‌నెస్, డైట్ విషయంలో వారిదే పూర్తి బాధ్యత అని , ఇప్పుడుతప్పు మరొకరి మీద నెట్టి వేయడం సమంజసం కాదని పీటీ ఉష తెలిపారు. అయితే కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో వినేష్ ఫోగట్‌ను డిస్‌క్వాలిఫై చేయడంతో ఆమె ఏ పతకం పొందకుండా అయింది. రజత పతకం ఇవ్వాలని వినేశ్ చేసిన అప్పీలుపై తుది తీర్పు ఈ నెల 13న రానుంది.












Click it and Unblock the Notifications