IND Vs AUS: ఇదే గొప్ప సంకేతం - ఫైనల్ విజేతను తేల్చేసిన రవిశాస్త్రి..!!
ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ క్రికెట్ ఫ్యాన్స్ ను షేక్ చేస్తోంది. యావత్ భారత్ రేపు (ఆదివారం) జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారనే అంచనాల్లో మాజీ క్రికెటర్లు బిజీగా ఉన్నారు. కంగారు లతో కాంగారు పెట్టించే టీం రోహిత్ సేన తల పడుతోంది.టైటిల్ ఫేవరెట్ గా భారత్ ఉన్నా..ఆసీస్ సైతం బలమైన ప్రత్యర్ధి కావటంతో ఆశలు - అనుమానాల మధ్య ఫైనల్ పోరు కోసం ఫ్యాన్స్ సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో రవిశాస్త్రి ఆసక్తి కర విశ్లేషణ చేసారు.
భారీ అంచనాలు:అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. బలమైన రెండు టీంలు విశ్వ విజేతగా నిలిచేందుకు నరేంద్రమోదీ స్టేడియంలో కొదమసింహాల్లా తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ రెండు జట్లలో ఏ విభాగంలోనూ ఎందులోనూ తక్కువ కావు. సమఉజ్జీల సమరంగా ప్రపంచ కప్ ఫైనల్ నిలవనుంది. అహ్మదాబాద్ లో ఇదే వేదికలో ఈ ప్రపంచకప్ లోనే టీమిండియా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ పైన విజయం సాధించింది. ఇప్పటికే ఆసీసీ ప్లేయర్స్ మైండ్ గేమ్ ప్రారంభించారు. తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తమ పైన ఒత్తిడి తేదని చెప్పలేం కానీ, అన్ని మ్యాచ్ ల తరహాలోనే ఫైనల్ లోనూ ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.

రవిశాస్త్రి సూచన:ఇక, ఇప్పుడు ఫైనల్స్ వేళ టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీమిండియాకు కీలక సూచన చేసారు. ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు అనుసరిస్తున్న వ్యూహానికే ఫైనల్ లో కట్టుబడి ఉండాలని సూచించారు. భారత జట్టు ప్రశాంతంగా ఉంది. జట్టు సొంతగడ్డపై ఆడుతోంది. బాగా అనుభవం ఉన్న జట్లు ఇది. ఏదీ భిన్నంగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆడుతున్నట్లే..గత మ్యాచ్ ను ముగించిన మాదిరే ఆడితే సరిపోతుందని చెప్పుకొచ్చారు. టీమిండియా ప్రపంచ కప్ ను అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసారు. టీంలో 8,9 మంది ఆటగాళ్లు రాణిస్తుండటం గొప్ప సంకేతమని చెప్పిన రవిశాస్త్రి ఇంతకంటే ఏం కావాలన్నారు. ఆటగాళ్లు ఒత్తిడిని దరి చేయనీయద్దని..ఫైనల్ కాబల్లి అత్యుత్సాహం ప్రదర్శఇంచవద్దని సూచించరాు.
కట్టడి వ్యూహాలతో:జట్టులో ప్రతీ ఒక్కరికీ తమ బాధ్యతేంటో తెలుసని చెప్పారు. ఒకరో, ఇద్దరి పైనో టీం ఆధారపడకపోవటం కలిసొచ్చే అంశంగా రవిశాస్త్రి విశ్లేషించారు. ఇక..కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ ఇప్పటికే అహ్మదాబాద్ పిచ్ పైన అధ్యయనం చేసారు. ఎలాంటి వ్యూహాలు..టీం తుది కూర్పు పైన ఒక అంచనాకు వచ్చారు. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన బౌలింగ్ వ్యూహంతో సిద్దమవుతున్నారు. అదే విధంగా చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్ బౌలర్లు ఆదిలోనే భారత బ్యాటర్లను అవుట్ చేయటంతో..ఇప్పుడు ఏ విధంగా వాళ్లను ఓపెనర్లు ఎదుర్కోవాలనేది కీలకంగా మారుతోంది. అదే సమయంలో ఫైనల్ మ్యాచ్ లో టాస్ మరింత కీలక భూమిక పోషించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications