DC vs RCB: మమ్మల్ని ముంచింది అదే- ఢిల్లీ మ్యాచ్ ఓటమిపై తేల్చేసిన ఆర్సీబీ..!

బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ ను చివరి ఓవర్ వరకూ తీసుకురావడంలో సఫలమైన ఆర్సీబీ.. లాస్ట్ మినిట్ లో డేవిడ్ మిల్లర్ ను నియంత్రించలేక చేతులెత్తేసింది. అయితే ఆర్సీబీ టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం దీని వెనుక మరో కారణం చెబుతోంది.

IPL 2026: నెట్స్ లో సిక్సర్లు-గ్రౌండ్ లో తేలిపోతున్న 21 కోట్ల స్టార్..!
IPL 2026: నెట్స్ లో సిక్సర్లు-గ్రౌండ్ లో తేలిపోతున్న 21 కోట్ల స్టార్..!

ఢిల్లీతో మ్యాచ్ లో ఎక్కువ భాగం ఆ జట్టును బాగానే కట్టడి చేసినప్పటికీ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ఒక బంతి మిగిలి ఉండగా ఛేజింగ్‌ను పూర్తి చేయడంతో ఆ స్కోరు చాలా తక్కువని అర్దమైంది. ఈ నేపథ్యంలో సొంత గ్రౌండ్ లో తమ మొదటి ఓటమిపై స్పందిస్తూ.. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్.. జట్టు ఆటను అతిగా విశ్లేషించబోదని పేర్కొన్నారు. తాము పాజిటివ్ విషయాలను, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను ఎప్పుడూ పరిగణనలోకి తీసుకుంటామమన్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నామని, కాబట్టి ఈ మ్యాచ్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని, తర్వాతి మ్యాచ్‌లో తిరిగి మా సాధారణ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నిస్తామన్నాడు.

RCB Blames Tacky Chinnaswamy Pitch for Delhi Loss Refuses to Dwell on Defeat
DC vs RCB: 3 బంతుల్లో ఆర్సీబీ మ్యాచ్ లాగేసుకున్న మిల్లర్ ..!
DC vs RCB: 3 బంతుల్లో ఆర్సీబీ మ్యాచ్ లాగేసుకున్న మిల్లర్ ..!

పేలవంగా ఉన్న చిన్నస్వామి స్టేడియం పిచ్‌ను ఆర్ససీబీ బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారని, ఫలితంగా కొన్ని పరుగులు తక్కువగా చేశారని బోబట్ అంగీకరించాడు. మ్యాచ్ అనంతర ఇంటర్వ్యూలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టు బహుశా 15-20 పరుగులు తక్కువగా చేసిందని అన్నాడు. దీంతో సొంత గ్రౌండ్ కూడా తమకు అనుకూలంగా లేకపోతే ఎలా అన్న అసహనం ఇప్పుడు ఆర్సీబీలో కనిపిస్తున్నట్లు ఈ వ్యాఖ్యల్ని బట్టి అర్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+