ఐపీఎల్ యంగ్ ప్లేయర్ పై పాకిస్తాన్ బ్యాన్

ఐపీఎల్ 2026 రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ 57 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెరో నాలుగు వికెట్లు పడగొట్టిన పేసర్లు సకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేల మ్యాజికల్ స్పెల్.. ఈ జట్టును పాయింట్ల పట్టికలో టాప్-4లోకి చేర్చింది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది కోల్ కత నైట్ రైడర్స్. చెన్నై చెపాక్ స్టేడియం దీనికి వేదిక.

ఈ పరిస్థితుల మధ్య కోల్ కత నైట్ రైడర్స్ యంగ్ ప్లేయర్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన కడుపుమంటను ప్రదర్శించింది. జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ రెండేళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో ఆడకుండా నిషేధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడమే దీనికి కారణం. పీఎస్ఎల్ నుండి బయటికి వచ్చిన బ్లెస్సింగ్ ముజారబాని ఐపీఎల్ లో చేరాడు. కోల్ కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు.

Kolkata Knight Riders Player Banned by Pakistan Cricket Board for Two Years in PSL despite offer

ముజారబానిపై నిషేధాన్ని విధిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. స్పష్టమైన ఆఫర్ అతనికి ఇచ్చామని, మధ్యలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించకూడదనే ప్రాథమిక నిబంధనలను అంగీకరించిన తర్వాత కూడా ముజారబాని వాటిని విస్మరించాడని, వేరే (ఐపీఎల్) కాంట్రాక్ట్ ను కుదుర్చుకున్నాడని పేర్కొంది. అందుకే పీఎస్ఎల్ ఆడకుండా రెండేళ్ల పాటు నిషేధాన్ని విధించినట్లు పీసీబీ వివరించింది.

ముజారబానీ మొదట పీఎస్ఎల్ 2026లో ఆడేందుకు ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఐపీఎల్ నుంచి ఆఫర్ రావడంతో దాన్ని వదులకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో చేరాడు. బంగ్లాదేశ్ కు చెందిన పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కు బదులుగా బ్లెస్సింగ్ ముజారబానిని జట్టులోకి తీసుకుంది కేకేఆర్. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముజారబానీ రెండు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించుకున్నాడు.

మరోవంక- ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లో ముజారబానీ 13 వికెట్లతో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. జింబాబ్వే సూపర్ ఎయిట్స్ దశకు చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. గతంలో పీఎస్ఎల్ లో ముల్తాన్ సుల్తాన్స్‌ తరఫున ఆడాడు. టైటిల్ గెలిచిన జట్టులో అతను సభ్యుడు కూడా. ఈ ఏడాది ఫిబ్రవరి 11న పీఎస్ఎల్ వేలంలో మొదట ఎంపిక కాలేదు. షమార్ జోసెఫ్‌ను విడిచిపెట్టిన తర్వాత ఇస్లామాబాద్‌తో నేరుగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+