DC vs RCB: 3 బంతుల్లో ఆర్సీబీ మ్యాచ్ లాగేసుకున్న మిల్లర్ ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ipl 2026)లో మరో అద్భుతమైన మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్ చివరి ఓవర్లో అనూహ్య ఫలితంతో ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (63) మాత్రమే అర్ధసెంచరీ సాధించాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్, కుల్దీప్, ఎంగిడి తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా చివర్లో అద్భుతం చేసింది.

SRH vs CSK: మ్యాచ్ లో ప్యాట్ కమ్మిన్స్ ఆడతాడా ? తేల్చేసిన SRH..!
SRH vs CSK: మ్యాచ్ లో ప్యాట్ కమ్మిన్స్ ఆడతాడా ? తేల్చేసిన SRH..!

రాయల్ ఛాలెంజర్స్ ఇచ్చిన 176 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగు చేసిన పాథుమ్ నిస్సంక ను ఎల్బీడబ్యూగా వెనక్కి పంపిన భువనేశ్వర్ కుమార్... అదే ఊపులో కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2)ను కూడా అవుట్ చేయడంతో డీసీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ నిలకడగా ఆడుతూ ఆర్సీబీపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ 57 పరుగులకు అవుటయ్యారు. దీంతో 87 పరుగుల వద్ద డీసీ నాలుగో వికెట్ కోల్పోయింది.

David Miller Time DC s Last-over Heroics Snatch Victory from RCB
IPL 2026: నెట్స్ లో సిక్సర్లు-గ్రౌండ్ లో తేలిపోతున్న 21 కోట్ల స్టార్..!
IPL 2026: నెట్స్ లో సిక్సర్లు-గ్రౌండ్ లో తేలిపోతున్న 21 కోట్ల స్టార్..!

ఈ దశలో ట్రిస్టన్ స్టబ్స్ కు జతకలిసిన కెప్టెన్ అక్షర్ పటేల్ కాసేపు ఆర్సీబీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. కానీ 26 పరుగులు చేశాక అక్షర్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దీంతో స్టబ్స్ కు డేవిడ్ మిల్లర్ (David Miller) జతకలిశారు. వీరిద్దరూ క్రమంలో భారీ షాట్లు ఆడుతూ ఆర్సీబీని విజయాన్ని దూరం చేస్తూ వచ్చారు. అయితే చివర్లో ఆర్సీబీ పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో 20వ ఓవర్లో గెలవాలంటే ఢిల్లీకి 15 పరుగులు అవసరం అయ్యాయి. షెపార్డ్ వేసిన చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్ధితి. కానీ డేవిడ్ మిల్లర్ వరుసగా సిక్స్, సిక్స్, ఫోర్ కొట్టడంతో ఢిల్లీ మ్యాచ్ ను ఆర్సీబీ చేతుల్లో నుంచి లాగేసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ మాత్రమే 3 వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యాకు మరో వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+