రాయల్ ఛాలెంజర్స్ కు స్టార్ ప్లేయర్ దూరం

స్టార్ ఫాస్ట్ బౌలర్ ఒకరు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ పేసర్.. గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకుంటోన్నాడు. కనీసం రెండు వారాల పాటు ఐపీఎల్ లో కనిపించకపోవచ్చు. ఈ మధ్యకాలంలో రాయల్ ఛాలెంజర్స్ మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది. వీటికి అతను అందుబాటులో ఉండట్లేదు. ఆ తర్వాతే జట్టుతో కలుస్తాడు.

హ్యామ్ స్ట్రింగ్, అకిలెస్ టెండన్ సమస్యలతో హేజిల్‌వుడ్ బాధపడుతున్నాడు. ఏప్రిల్ రెండో వారం వరకు క్రికెట్ దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించడంతో విశ్రాంతి తీసుకుంటోన్నాడు. అప్పటికి అతను గ్రౌండ్ లోకి దిగి దాదాపు అయిదు నెలలవుతుంది. నవంబర్ లో చివరి మ్యాచ్ ఆడాడు హేజిల్ వుడ్. గాయం కారణంగా మొన్నటి టీ20 వరల్డ్ కప్ కు కూడా దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్నాడు.

Royal Challegers Bengaluru set to miss its Star Bowler Josh Hazlewood for first two IPL games

హేజిల్‌వుడ్ గైర్హాజరీలో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫ్ఫీ.. రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ ను లీడ్ చేయనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లకు డఫీ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఏప్రిల్ 10న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా తిరిగి జట్టులోకి వస్తాడు. గత సీజన్‌లో ఆర్‌సీబీకి కీలక ఆటగాడిగా నిలిచాడు హేజిల్ వుడ్. 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లోనూ అదే స్థాయిలో రాణిస్తాడని ఆర్‌సీబీ అంచనా వేస్తోంది.

ఆస్ట్రేలియాకు చెందిన మరో పేసర్ పాట్ కమిన్స్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఎప్పుడు చేరతాడనే దానిపై స్పష్టత లేదు. హేజిల్‌వుడ్, కమిన్స్ ఇద్దరూ స్వదేశంలో జరిగిన చాలా మ్యాచ్‌లకు, ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ లో ఆడలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా వారి విషయంలో జాగ్రత్తగా ఉంటోంది.

ఇదిలావుండగా పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడే విషయంలో భద్రతాపరమైన ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లకు ప్రయాణ ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+