రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ దగ్గరికొచ్చింది. రేపే ఓపెనర్. తొలి మ్యాచ్.. నిరుటి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.
ఈ మ్యాచ్ కోసం చిన్నస్వామి స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టం అయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ దీనిపై సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 2,000 మంది పోలీసులను స్టేడియం వద్ద మోహరింపజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. క్యూఆర్ కోడ్ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

మ్యాచ్‌కు కొద్దిరోజుల ముందు నుంచే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మాక్ డ్రిల్ నిర్వహించింది. గత దుర్ఘటనలు పునరావృతం కాకుండా, భద్రతా లోపాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. సివిల్ డిఫెన్స్, గరుడ ఫోర్స్, అగ్నిమాపక శాఖ బృందాలు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను కమాండ్ సెంటర్, కమిషనర్ కార్యాలయాలకు అనుసంధానించి నిఘా ఉంచారు.
స్టేడియం లోపలా, వెలుపలా తొమ్మిది అంబులెన్స్‌లు, వాటి రాకపోకలకు ప్రత్యేక మార్గాలున్నాయి. విధుల్లో ఉన్న పోలీసులు మ్యాచ్ చూడటానికి లేదా తమ స్థలాలను విడిచి వెళ్లడానికి అనుమతి లేదు. గేట్ల నియంత్రణ పూర్తిగా పోలీసుల చేతుల్లోనే ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం వద్దకు రావాల్సి ఉంటుంది. రోడ్లపైకి రావడం, ఆటగాళ్ల వాహనాలకు అడ్డుపడటం నిషేధం. భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పార్కింగ్ ప్రాంతాలు, రోడ్ డైవర్షన్లు ఏర్పాటయ్యాయి.
మ్యాచ్‌కు పేపర్ టికెట్లకు బదులుగా క్యూఆర్ కోడ్ ఆధారిత టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టికెట్లు ఉన్న వారికి మెట్రో ప్రయాణం ఉచితం. అభిమానుల కోసం అయిదు ప్రదేశాలలో పార్కింగ్ కల్పించారు. అక్కడి నుంచి బస్సుల ద్వారా స్టేడియానికి చేరవచ్చు. స్టేడియం చుట్టూ అదనంగా 50 సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు.
ఐపీఎల్ ఏర్పాట్లపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఈ ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్ల కేటాయింపు అంశం కూడా ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. వారి కుటుంబాలకు నాలుగు చొప్పున కేటాయించాలని కోరగా.. దీనికి ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
ఐపీఎల్ టిక్కెట్ల కోసం రాష్ట్ర ఎమ్మెల్యేల డిమాండ్‌పై ఈ సందర్భంగా శివకుమార్ స్పందించారు. నాలుగు టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదని కేఎస్సీఏ తేల్చి చెప్పిందని, అందుకే ఒక్క ఓపెనర్ కు మాత్రమే రెండు టికెట్లు ఇవ్వడానికి అంగీకరించిందని అన్నారు. గతంలో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రికి ఒక్కో సీటు కేటాయించేవారని, ప్రస్తుతం, కుటుంబ సభ్యులు మ్యాచ్‌లకు హాజరయితేనే రెండు టిక్కెట్లు ఇవ్వాలని మేము అభ్యర్థించినట్లు తెలిపారు. ఓపెనర్ కు రెండు టిక్కెట్లు లభిస్తాయని, తదుపరి మ్యాచ్‌లకు తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
ధురందర్ 2 కంటే లాంగ్ మ్యాచ్! ఐపీఎల్లో సరికొత్త రికార్డు -
Jasprit Bumrah:బుమ్రాకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!! -
కృనాల్ పాండ్యా విసిరేసే బంతులను ముంబై బ్యాటర్లు ఎలా ఫేస్ చేస్తారో..!! -
ఎంత సీఎం అయినా.. !! -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
ట్రాక్ ఎక్కేశాడు- కాచుకోండి ఇక -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications