Rishabh Pant: ఐపీఎల్ కు ముందే గుడ్ న్యూస్ చెప్పిన రిషబ్ పంత్..!

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదం తర్వాత క్రమంగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన రిషబ్ పంత్ .. త్వరలో జరగనున్న రెండు కీలక టోర్నీల్ని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇందులో ఒకటి ఐపీఎల్ 2024 టోర్నీ కాగా.. మరొకటి యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్ కప్. ఈ రెండు టోర్నీల్లో ఆడేందుకు రిషబ్ పంత్ తహతహలాడుతున్నా ఏదో మూల అభిమానుల్లో ఆందోళన, అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ తాజాగా ఓ వార్మప్ గేమ్ లో పాల్గొన్నాడు. బెంగళూరు సమీపంలోని ఆలూర్ లో నిర్వహించిన ఓ వార్మప్ గేమ్ లో రిషబ్ పంత్ పాల్గొని ఫుల్ మ్యాచ్ ఆడినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఫిట్ నెట్ మెరుగ్గా ఉందని, గతంలోలా మైదానంలో చురుగ్గా కదులుతున్నట్లు తెలిపాయి. ఇదే ఊపు కొనసాగిస్తే ఐపీఎల్ తో పాటు టీ20 వరల్డ్ కప్ లో తిరిగి పంత్ పునర్ వైభవం అందుకుంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Rishabh Panth returns to ground ahead of ipl 2024, eye on t20 world cup selection

ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ ను చూసిన వారంతా ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగడం ఖాయమనే అంచనాకు వచ్చేశారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ను ఐపీఎల్ లో నడిపిస్తాడనే నమ్మకం కుదిరిందని చెప్తున్నారు. ఇప్పటికే తాను ఐపీఎల్ టోర్నీ మొత్తం ఆడేందుకు పంత్ సిద్ధంగా ఉన్నట్లు రికీ పాటింగ్ కూడా వెల్లడించాడు. దీంతో పంత్ పై అంచనాలు పెరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్ లో సత్తా చాటుకోవడం ద్వారా టీ20 వరల్డ్ కప్ కు వెళ్లే భారత జట్టుకు కూడా ఎంపిక కావాలని పంత్ భావిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+