రోహిత్ రీ ఎంట్రీలో బిగ్ ట్విస్ట్, స్టార్ ప్లేయర్ వచ్చేసాడు - MI లో కీలక మార్పులు..!!

IPL 2026: ఐపీఎల్ లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముంబాయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఒక ప్రతీ మ్యాచ్ కు ముంబాయి జట్టుకు కీలకంగా మారుతోంది. ఈ రోజు గుజరాత్ తో జరిగే మ్యాచ్ కోసం టీంలో కీలక మార్పులతో సిద్దం అయింది. కెప్టెన్ హార్దిక్ ఆడటం సస్పెన్స్ గా మారుతోంది. రోహిత్ శర్మ గాయం కావటంతో గత మ్యాచ్ లకు దూరంగా ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ లో ఆడటం పైన జట్టు స్పష్టత ఇచ్చింది.

ఐపీఎల్ లో ముంబాయి ఇండియన్స్ కష్టాలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండటంతో ఇక ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతోంది. అందులో భాగంగా ఈ రోజు గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో కీలక మార్పులకు సిద్దమైంది. ఏప్రిల్ 12న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొడకండరాల గాయానికి గురి కావటంతో మధ్యలోనే గ్రౌండ్ వీడాడు. ఆ తరువాతి మ్యాచ్ లో ఆడలేదు. ఇక.. ఇప్పుడు రోహిత్ ఈ రోజు గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో ఆడటం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. ఆదివారం నాడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన శిక్షణా శిబిరంలో రోహిత్ అందరికంటే ముందుగా హాజరై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయటంతో ఫ్యాన్స్ ఇక రోహిత్ రీ ఎంట్రీ ఇస్తారని భావించారు. కాగా, తాజాగా ఫిట్‌నెస్ పరీక్షలో రోహిత్ తో పాటుగా శాంట్నర్ నెగ్గటంతో గుజరాత్ తో మ్యాచ్ కు ఈ ఇద్దరు సిద్దమని జట్టు స్పష్టం చేసింది.

rohit-sharma-and-mitchell-santner-are-fit-to-play-for-mumbai-indians-in-their-ipl-match-against-guj

రోహిత్, శాంట్నర్ రీ ఎంట్రీ

కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతం అవతున్నాడు. హార్దిక్ మ్యాచ్ లో ఆడుతారని సహచరులు చెబుతున్నా.. చివరి నిమిషం వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. హార్దిక్ ఆడకపోతే.. ఆ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఇంకా జట్టుతో కలవకపోవడం ముంబై జట్టును కలవరపెడుతోంది. ఇక.. ప్రస్తుత సీజన్ ముంబై ఇండియన్స్‌కు అస్సలు కలిసిరావడం లేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు, వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా విజయం సాధించడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. టోర్నమెంట్‌లో ముందడుగు వేయాలంటే గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఈ మ్యాచ్ వేళ జట్టు తుది కూర్పు పైన కసరత్తు జరుగుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+