రోహిత్ సతీమణి రితిక బిగ్ అనౌన్స్మెంట్..!!
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటి నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. రోహిత్ సతీమణి రితికా సజ్దే సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేసారు. రోహిత్ దంపతులు ఈ మధ్యనే రెండో బిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 15న మగబిడ్డను రితికా జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆ చిన్నారి పేరును ఇన్ స్టా వేదికగా రోహిత్ భార్య రితిక అనౌన్స్ చేశారు. 'అహాన్' అనే పేరును ఫిక్స్ చేసినట్లు రితిక ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.
రోహిత్ శర్మ కుమారుడు పేరు రివీల్ అయింది. రోహిత్ సతీమణి ఈ పేరును వెల్లించారు. 'అహాన్' అనే పేరును ఖరారు చేసారు. రితికా తన పోస్టింగ్ లో డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్మస్ శాంటా గెటప్‌లో ఉన్న ఓ ఫ్యామిలీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. అందులోనే అహాన్ పేరును రివీల్ చేశారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టర్లో ఉన్న బొమ్మలకు రితిక, రోహిత్ శర్మ, సమ్మీ, అహాన్ అనే పేర్లు కూడా పెట్టారు. రోహిత్ దంపతులకు తొలి సంతానం అమ్మాయి. సమైరా ప్రస్తుతం ఆరేళ్లు ఉంటాయి.

ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నది. అడిలైడ్ లో జరిగే రెండో టెస్టులో ఆడేందుకు క్రికెటర్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. ఆసీస్ తో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరం గా ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్లలేదు. కుమారుడు డెలివరీ వేళ సతీమణి వద్దే ఉన్నారు. ఇక, ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. రెండో టెస్టుకు సిద్దం అవుతున్నారు.ఈ సమయంలో రోహత్ సతీమణి తమ కుమారుడు పేరును రివీల్ చేస్తూ పెట్టిన పోస్టింగ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే టీం ఇండియా సభ్యులు రోహిత్ కు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications