ICC టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్.. కెప్టెన్ గా రోహిత్

గతేడాది కాలంగా డేరింగ్, డాషింగ్ క్రికెట్ ప్రదర్శన చేసిన 11 మంది ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ఈ స్క్వాడ్ లో టీమ్ ఇండియా జట్టు నుంచి నలుగురు ప్లేయర్లు ఉన్నారు. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తో పాటు టీమ్ ఇండియా సారథి రోహిత్ శర్మ ఈ లిస్టులో ఉన్నారు. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో ఉన్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం జట్టులో చోటు సంపాదించాడు. అంతేకాక ఈ టీమ్ కు కెప్టెన్ గానూ రోహిత్ ను ఎంపిక చేసింది ఐసీసీ.

సారథిగా హిట్ మ్యాన్

గతేడాది రోహిత్ శర్మ ప్రదర్శన అంతంత మాత్రంగానే సాగింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే రెండోసారి టీమ్ ఇండియాకు టీ20 కప్ ను అందించడంలో మాత్రం రోహిత్ కీలకపాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్.. తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అంతేకాక ఆ సిరీస్ లో రెండో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఇక స్టార్ పేసర్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.

Rohit Sharma Leads as Captain in ICC T20 Team of the Year

హెడ్ మాస్టర్..

ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా లిస్ట్ లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో 255 పరుగులు చేసిన హెడ్.. అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. ఇక అన్ని టీ 20ఫార్మాట్లు కలిపి నికోలాస్ పూరన్ 2వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ స్క్వాడ్ లో పూరన్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. ఇక బుమ్రా టీ 20 వరల్డ్ కప్ 2024లో 15 వికెట్లు రాబట్టగా.. అర్షదీప్ సింగ్ 17 వికెట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

ఐసీసీ టీ20 టీమ్ ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ అజామ్, నికోలస్ పూరన్, సికిందర్ రజా, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, వానిందు హసరంగ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+