ఏం హాలత్ అయిందిరా బై

Rohit Sharma: ఇటీవలే ముగిసిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన భారత జట్టు.. ఇక ఇంగ్లాండ్ సిరీస్‌కు తయారవుతోంది. అయిదు టీ20 ఇంటర్నేషనల్స్, మూడు వన్డే మ్యాచ్‌లతో కూడుకున్న సిరీస్ ఇది. తొలి టీ20 ఈ నెల 22వ తేదీన ఆరంభం కాబోతోంది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.

ఈ సిరీస్‌లో ఆడే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే ప్రకటించింది కూడా. ఈ ఫార్మట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. గాయం వల్ల చాలాకాలం పాటు జట్టుకు దూరంగా ఉంటూ వచ్చిన మహ్మద్ షమీతో పాటు టీ20 ఆడే రెగ్యులర్ ప్లేయర్లందరూ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Rohit Sharma will attend Mumbai s practice session today for the Ranji Trophy

దీని తరువాత వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ఉంటుంది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన నాగ్‌పూర్‌లో ఆరంభమౌతుంది. ఇది- రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత ప్రతిష్ఠాత్మంగా మారింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా ఫెయిల్యూర్ అయిన నేపథ్యంలో- ఖచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడతను.

ఈ క్రమంలో- ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఆరంభం కాబోయే రంజీ మ్యాచ్‌లల్లో ముంబైకి ప్రాతినిథ్యాన్ని వహించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.

దీనికి కారణాలు లేకపోలేదు. రంజీ ట్రోఫీ ఆడటానికి ముంబై జట్టు వాంఖెడేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేడియాల్లో వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది. ఆ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు రోహిత్ శర్మ.

తాను ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటానంటూ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అధికారికంగా సమాచారం ఇచ్చాడు కూడా. ఈ విషయాన్ని ఎంసీఏ ధృవీకరించింది. ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటానంటూ రోహిత్ శర్మ తమకు సమాచారం ఇచ్చాడని, నేడు వాంఖెడె స్టేడియంలో నెట్స్‌కు హాజరవుతాడనీ పేర్కొంది. అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ సైతం ప్రాక్టీస్‌లో పాల్గొనబోతోన్నట్లు తెలిపింది.

దీనితో రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఆడటానికి సిద్ధపడ్డాడంటూ వార్తలు వస్తోన్నాయి. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్‌ను ఢీ కొట్టబోతోంది ముంబై. ఈ మ్యాచ్‌లో ఆడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడనీ అంటున్నారు. 2015 తరువాత రంజీలకు దూరం అయ్యాడీ డాషింగ్ ఓపెనర్.

తాను రిటైర్మెంట్ కాదలచుకోలేదంటూ ఆస్ట్రేలియా టూర్‌లోనే రోహిత్ శర్మ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కష్టపడి మళ్లీ ఫామ్‌లోకి వస్తాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఫామ్‌లో లేకపోవడం వల్ల చివరి టెస్ట్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. మళ్లీ ఫామ్‌లోకి వస్తానని బలంగా నమ్ముతున్నానని, స్పోర్ట్స్ అనేది నా జీవితంలో ఓ ముఖ్య భాగంమని, దాన్నుంచి అంత త్వరగా దూరం కాదలచుకోలేదంటూ వివరణ ఇచ్చాడు అప్పట్లో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+