CSK కాస్ట్లీ మిస్టేక్..!!

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ లో భారీ మార్పులు చేర్పులు చోటు చేైసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ల మార్పిడి ఒప్పందం ఖరారైంది. ఈ డీల్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సీఎస్కే లోకి వెళ్లగా.. రవీంద్ర జడేజా, సామ్ కరన్.. రాజస్థాన్ రాయల్స్‌లో చేరనున్నారు. దీనికి సంబంధించిన డీల్ అధికారికంగా పూర్తయింది. రవీంద్ర జడేజాను రిలీజ్ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఓ వీడియోను విడుదల చేసింది.

నేడు ఐపీఎల్ రిటెన్షన్స్‌ కు తుది గడువు. ఈ పరిస్థితుల మధ్య రవీంద్ర జడేజా, సామ్ కరన్, సంజు శాంసన్ మార్పిడి ప్రక్రియ పూర్తయింది. రిటెన్షన్స్ తర్వాత ఈ ఒప్పందాన్ని రెండు జట్లు ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటించనున్నాయి. 2026 సీజన్ తర్వాత మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచే అతని వారసుడిగా సంజు శాంసన్ ను తీసుకోవడం, జట్టును పునర్నిర్మించే ప్రయత్నాల్లో భాగంగా ఈ డీల్ జరిగింది. రవీంద్ర జడేజాను 14 కోట్ల రూపాయలకు జట్టులోకి తీసుకుంది రాజస్థాన్ రాయల్స్.

Sanju Samson and Ravindra Jadeja Swap Deal Sealed

ఐపీఎల్ లో నిలకడగా సత్తా చాటుతోన్న ప్లేయర్లల్లో ఒకడు.. సంజు శాంసన్. అటు టీమిండియా తరఫున టీ20 ఇంటర్నేషనల్స్ లోనూ అదరగొడుతున్నాడు. ఈ ఫార్మట్ లో ఇప్పటివరకు మూడు సెంచరీలు బాదాడు. ఈ రికార్డు అతి కొద్దిమందికి మాత్రమే ఉంది. దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడీ మలయాళీ క్రికెటర్. 2013లో రాజస్థాన్ రాయల్స్ తో టై అప్ అయ్యాడు. అప్పటి నుంచీ అదే జట్టులో కొనసాగుతున్నాడు.

2018లో అతన్ని రిలీజ్ చేసినప్పటికీ.. మళ్లీ అదే ఫ్రాంఛైజీ అతన్ని రిటైన్ చేసుకుంది. 18 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పొడిగించుకుంది. సుదీర్ఘకాలంగా జట్టు కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాలని సంజు శాంసన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో సీజన్ నుండి ఆ జట్టుతో కొనసాగకపోవచ్చంటూ ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే ఖరారైంది.

ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. 12 సీజన్ల పాటు అతను చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ప్రస్తుతం జడేజా లీగ్ ఫీజు 18 కోట్ల రూపాయలు. కాగా దీన్ని 14 కోట్ల రూపాయలకు తగ్గించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతని రాకతో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండ్ విభాగం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు. జడేజాతో పాటు
సామ్ కరన్ కూడా ఆర్ఆర్ కు వచ్చాడు. అతని లీగ్ ఫీజు 2.4 కోట్ల రూపాయలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+