ఇష్టం లేకపోయినా టీమిండియా మేనేజ్మెంట్ చేసిన మంచి పని అదే
టీ20 ప్రపంచకప్ లో సంజు శాంసన్ హీరోగా అవతరించాడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లలో అతని అసాధారణ ప్రదర్శన భారత బ్యాటింగ్ లైనప్‌కు ఊపునిచ్చాయి. సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకురావడం నిర్ణయాత్మకంగా మారింది. ఈ టోర్నమెంట్ ఆసాంతం శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. నాలుగు మ్యాచ్‌లలో ఈ ఓపెనర్ 77.33 సగటుతో ఏకంగా 232 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 201.73గా నమోదైంది.
ఈ మెరుపు బ్యాటింగ్‌తో భారత్ ఆడిన చివరి రెండు మ్యాచ్‌లలో సూపర్ 8 మ్యాచ్, సెమీఫైనల్‌లో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. సూపర్ 8స్ దశలో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 42 బంతుల్లో 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని వీరోచిత ఇన్నింగ్స్‌లు జట్టును ఫైనల్‌కు నడిపించాయి.

ఇప్పుడు యావత్ దేశం కేరళకు చెందిన ఈ స్టార్ ఆటగాడు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్‌లో మరోసారి మెరుస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. ఈ కీలక మ్యాచ్‌లో సంజు మరోసారి తన అద్భుత ఆటతీరుతో జట్టును గెలిపించాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు. న్యూజిలాండ్ పేస్ బౌలింగ్‌ను సంజు ఎలా ఎదుర్కొంటాడనేదే అతని ఇన్నింగ్స్ పరిమాణాన్ని నిర్ణయించడంలో కీలకం. 'సంజు శాంసన్ జొఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొన్న విధంగా మాట్ హెన్రీని కూడా ధీటుగా ఆడగలిగితే అతన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.
వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆరంభంలో అభిషేక్ శర్మ జట్టుకు కీలకంగా మారతాడని అంచనాలు ఉండేవి. సంజు ప్రదర్శనపైనే సందేహాలు ఉండేవి. టోర్నీ కీలక దశకు వచ్చే సరికి పరిస్థితి రివర్స్ అయింది. సంజు నిలకడగా రాణిస్తోండగా.. అభిషేక్ శర్మ ఫామ్ పూర్తిగా కోల్పోయాడు. జింబాబ్వేపై ఇన్నింగ్ మినహా ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. లీగ్ దశ తర్వాత కడుపు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రి పాలు కావడంతో రిథమ్ కోల్పోయాడు.
అదే సమయంలో ప్రత్యర్థి జట్లు కూడా అతడి బలహీనతలను పసిగట్టాయి. పవర్‌ప్లేలో పేస్ బౌలింగ్‌ను ఇష్టపడే అభిషేక్‌కు స్పిన్నర్లను ప్రయోగించి కట్టడి చేశాయి. ఆఫ్ స్పిన్నర్లు, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లతో అతడిని పరుగులు చేయకుండా నిలువరిస్తున్నాయి. పేస్ లేని బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ, షాట్లకు తొందరపడి వికెట్ సమర్పించుకుంటున్నాడు అభిషేక్. ఈ పరిస్థితుల్లో అతని దూకుడుపై నమ్మకం ఉంచి, ఫైనల్ లో ఆడనివ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications