సారా చేతిలో బీర్ బాటిల్? గోవా వీడియోపై నెటిజన్ల ఫైర్!
సెలబ్రిటీల పిల్లలంటే ఎప్పుడూ కెమెరా కళ్ల ముందే ఉండాలా? వాళ్లకు సొంత ఇష్టాఇష్టాలు ఉండవా? గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా టెండూల్కర్ వీడియోపై నెటిజన్లు చేస్తున్న దారుణమైన ట్రోలింగ్ చూస్తుంటే.. సోషల్ మీడియాలో మనస్తత్వాలు ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. సారాను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలేంటి? దానికి ఆమె ఫ్యాన్స్ ఇస్తున్న కౌంటర్లేంటి? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రస్తుతం నెట్టింట ట్రోలర్లకు లక్ష్యంగా మారింది. గోవా వీధుల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్న ఒక వీడియో వైరల్ కావడమే దీనికి కారణం. కొత్త సంవత్సరం వేడుకల కోసం సారా తన ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తీసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో సారా చేతిలో ఒక బాటిల్ ఉంది. అది 'బీర్ బాటిల్' అని ఆరోపిస్తూ నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఏకంగా సచిన్ టెండూల్కర్ పేరును ప్రస్తావిస్తూ.. "సచిన్ కుమార్తె ఇలాంటి పనులు చేయడం ఏంటి?" అంటూ అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.

సారాకు నెటిజన్ల సపోర్ట్
అయితే సారాపై జరుగుతున్న ఈ దాడిని చాలామంది తీవ్రంగా ఖండించారు. ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు."సారా మద్యం తాగితే సచిన్ ప్రమోట్ చేసినట్లు ఎలా అవుతుంది? ఒక కూతురు డ్రింక్ చేయకూడదా? ఇది ఏ రకమైన పిచ్చి మనస్తత్వం?" అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. "అందులో ట్రోల్ చేయడానికి ఏమీ లేదు, ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది" అని మరికొందరు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications