Indonesia Masters 2025: నేటి నుంచే ఇండోనేషియా.. భారత స్టార్ అథ్లెట్స్ మెరిసేనా...?
ఇండోనేషియా రాజధాని జకర్తా వేదికగా నేటి నుంచి ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ ప్రారంభం కానుంది. భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం పైనే క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వివాహం తర్వాత పీవీ సింధు తన నూతన కోచ్ ఇర్వాన్ స్యా సారథ్యంలో బరిలోకి దిగుతోంది. అటు స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కూడా వివాహం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టనున్నాడు.
సాత్విక్- చిరాగ్ ద్వయం:
భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఈ ఏడాదిని సక్సెస్ తో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనిలో భాగంగానే ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ 500 టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మలేసియా ఓపెన్ సూపర్ 1000, ఇండియా ఓపెన్ 750 టోర్నీల్లో సెమీస్ వరకూ చేరారు. కానీ ఫైనల్ కు చేరలేకపోయారు. దీంతో ఈ సారి కసిగా ఆడి విజేతగా నిలవాలని ఈ ద్వయం దృఢ నిశ్చయంతో ఉంది. మెన్స్ డబుల్స్ లో రే చెన్- యూ లిన్ ( చైనీస్ తైపీ) జట్టుతో సాత్విక్- చిరాగ్ జట్టు తమ ఆటను ప్రారంభించనుంది.

వివాహం తర్వాత తొలిసారి..:
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఈ ఏడాది తొలిసారి బ్యాట్ పట్టి కోర్టులోకి అడుగుపెట్టనున్నాడు. ఇండోనేషియా ఓపెన్ లో క్వాలిఫయింగ్ విభాగంలో ఆడబోతున్నాడు. భారత్ కే చెందిన ఆయుశ్ శెట్టితో శ్రీకాంత్ క్వాలిఫయర్ లో పోటీ పడుతున్నాడు.
బరిలోకి స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. వివాహం తర్వాత బ్యాడ్మింటన్ గ్రౌండ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. తన నూతన కోచ్ ఇర్వాన్ స్యా మెలకువలతో బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్ లో తాన్యా హేమంత్, ఇషారాణి పోటీ పడనున్నారు. మెయిన్ డ్రా విభాగంలో పీవీ సింధు, రక్షిత శ్రీ, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్ బరిలోకి దిగనున్నారు. మరి భారత స్టార్ అథ్లెట్స్ ఈ సారి ఎన్ని విజయాలు సాధిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications